ఓటీటీ.. కరోనా ముందు వరకు దీనికి గురించి అవగాహన పెద్దగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే లాక్ డౌన్ విధించటం.. టీవీల్లో రోజువారీగా వచ్చే డైలీ సీరియల్స్ ఆగిపోవటం..రియాల్టీ షోలు నిలిచిపోవటంతో.. వినోదం కోసం కిందామీదా పడాల్సి వచ్చింది. అప్పటికే వచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫాంల వైపుకు రావటం.. వచ్చిన వారిని వచ్చినట్లుగా తమ బుట్టలోకి వేసుకోవటం.. ఆ తర్వాత జరిగినదంతా తెలిసిందే.
ఇవాల్టి రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే.. అయ్యే ఖర్చుకు.. ఇంట్లో కూర్చొని ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎన్ని కావాలంటే అన్ని సినిమాలు.. అది కూడా భాషతో సంబంధం లేకుండా చూసే వెసులుబాటు ఉండటం.. కిందనే సబ్ టైటిల్స్ కూడా రావటంతో.. తెలుగు ప్రేక్షకుడు తొలిసారి భాషలతో సంబంధం లేకుండా విపరీతంగా సినిమాలు చూడటం షురూ చేశారు. దీనికితోడు వెబ్ సిరీస్ లు ఓటీటీ ఫ్లాట్ ఫాంలను మరింత దగ్గర చేశాయి. ఏతావాతా..లాక్ డౌన్ మధ్య నాటికే ఓటీటీలతో తెలుగు ప్రజల అనుబంధం భారీగాపెరిగిపోయిన పరిస్థితి.
ఎప్పుడైతే ఓటీటీ రుచి చూశారో.. అప్పటివరకు ఒక మోస్తరు టీవీతో సర్దుకునే చాలామంది.. పెద్ద స్క్రీన్ టీవీల్నికొనుగోలు చేయటం మొదలు పెట్టారు. కాలగర్భంలో ఏడాదిన్న కలిసిపోవటం.. రెండు సార్లు లాక్ డౌన్ విధించటం.. రెండోసారి అన్ లాక్ అయినప్పటికీ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పినా.. సినిమాలు విడుదల చేయటానికి నిర్మాతలు ముందుకురాని పరిస్థితి. ఈ నెల 30 నుంచి థియేటర్లు ఓపెన్ కావటంతో పాటు.. పలు సినిమాలు విడుదలయ్యేందుకు వీలుగా నిర్మాతలు సిద్ధమైన సంగతి తెలిసిందే.
అదేసమయంలో.. థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలన్న ప్రచారం ఈ మధ్యనే మొదలైంది. దాన్ని మరింత ఎక్కువగా ప్రజల మనసుల్లోకి వెళ్లేందుకు.. నటీనటుల్లో ఎవరికి ఏ మాత్రం అవకాశం వచ్చినా.. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడాలన్న ప్రమోషన్ చేయటం ఎక్కువైంది.అంతేకాదు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద సినిమా చూస్తే వచ్చే ఫీల్ కు.. థియేటర్ లో భారీ స్క్రీన్ మీద చూస్తే వచ్చేదానికి ఏ మాత్రం సంబంధం లేదన్న మాటలు ఎక్కువ అయ్యాయి.
ఇలాంటి వేళ.. సీనియర్ నిర్మాత.. ఇండస్ట్రీలో తనకుంటూ ఒక ఇమేజ్ ఉన్న పెద్ద మనిషి ఎన్వీ ప్రసాద్ తాజాగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. తమ బ్యానర్ (మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్)నిర్మించిన 93వ సినిమా ఇష్క్ గా పేర్కొన్న ఆయన.. థియేటర్లు రీఓపెన్ అయిన మొదటి రోజునే తమ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని ముందు నుంచి అనుకుంటున్నామని.. తాజాగా అదే పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30 నుంచి థియేటర్లు రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో.. ఆయన థియేటర్ లో సినిమాకు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద సినిమాకు మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓటీటీ ఫ్లాట్ ఫాం వారు వ్యవహరించే తీరును ఆయన బయటపెట్టారు. ఆయన మాటల్లోనే చదివితే..
‘మా సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాం. ఓటీటీ ఆలోచనే రాలేదు.గతానికి భిన్నంగా ఇప్పుడు ఓటీటీ నిబంధనలు మొత్తం మారిపోయాయి. చిన్న సినిమాలకు వచ్చేసరికి.. పది మందికి కంటెంట్ డెలివరీ చేయాలి. వాళ్లు దాన్ని చూడాలి. వారు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మన ప్రొడక్టు మనం తీసుకుని ఎవరో పది మందికి చూపించే బదులు.. పది మంది డిస్ట్రిబ్యూటర్లకుసినిమా చూపిస్తే ఫుల్ శాటస్ ఫ్యాక్షన్ ఉంటుంది.
వాళ్లతో మంచి రిలేషన్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లో అంత కాన్ఫిడెన్సు లేకుంటే సినిమా తీయలేమేమో అన్నది నా అభిప్రాయం’ అంటూ అసలు విషయాల్ని వెల్లడించారు. ఓటీటీలో విడుదల చేయాలంటే ముందుగా పది మందికి సినిమా చూపించి.. వారు ఓకే చెబితే కానీ సినిమాకు పచ్చజెండా ఊపరన్న కొత్త నిజం విన్న వారంతా విస్మయానికి గురవుతున్నారు. ఓటీటీనా మజాకానా?