వార్తను దాచడం - డబ్బును ఖర్చు చేయకుండా మిగల్చడం అంత ఈజీ కాదు. నోటి దురద ఉన్నవాళ్లను ఆపడం కూడా దాదాపు అసాధ్యం. ఎప్పుడూ ఏదో ఒకటి నస పెట్టనిదే నిదుర పట్టదు ఈ బాపతు మనుషులకు. ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అనడంతో చిక్కుల్లో పడుతుంటారు.
అయితే అలాంటి పని చేయదు కానీ .. పాపం తెలుగింటి సీతమ్మ అంజలి మాత్రం .. ఉన్న మాటని మనసులోనే దాచుకోలేదు. ముఖంపై బైటికే అనేస్తుంటుంది. రహస్యాన్ని రహస్యంగా మాట్లాడే అలవాటు లేక చాలా సార్లు చిక్కుల్లో పడింది. అంతెందుకు అప్పట్లో కుటుంబ కలహాల్ని ఏమాత్రం దాచి పెట్టలేక బైటి ప్రపంచానికి చిక్కింది. నలుగురి నోళ్లలో నానిపోవాల్సొచ్చింది. ఇప్పుడు అదే పాయింట్ తన కెరీర్ మొత్తాన్ని వెంటాడుతోంది.
ఎవరైనా దర్శకులు అంజలికి ఓపెన్ ఆఫర్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. తన ప్రతిభ చూసి అవకాశం ఇచ్చినా తన నుంచి ఏం ముప్పు వెంటాడుతుందో అన్న భయం వాళ్లకు ఉంది. అందుకే ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న తరమణి - ఇరైవి .. వంటి సినిమాల్లో అంజలి కథానాయిక అని బైటికి తెలియకుండా దాచేశారు సదరు దర్శకులు. చిత్రీకరణ సాంతం పూర్తయ్యే వరకూ ఏ ఒక్క విషయాన్ని బైటపెట్టకూడదని అంజలితో ప్రామిస్ కూడా తీసుకున్నారుట. ప్చ్.. మరీ అంత ప్రాబ్లెమాటిక్ ఎందుకయ్యావ్ అంజలి? విశ్లేషించుకోలేదా?