'పుష్ప' లెక్కల్లో మార్పులు ఉండబోతున్నాయా...?

Update: 2020-07-19 17:30 GMT
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి తగ్గట్టే బడ్జెట్ కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా అన్ని సినిమాల బడ్జెట్ లెక్కల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో 'పుష్ప' టీమ్ కూడా బడ్జెట్ తగ్గించుకునే ఆలోచన చేస్తోందని.. అలానే బన్నీ కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గితే ఆగ‌స్ట్ లాస్ట్ వీక్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ముందుగా బన్నీ - రష్మిక పై సాంగ్ చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ ఎక్కువ మంది డాన్సర్స్ తో షూట్ చేయడం రిస్క్ అని ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారట. సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో ఉండే సన్నివేశాలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. కాగా 'పుష్ప' కి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా నటించబోతున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన బన్నీ 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ పై దృష్టి సారిస్తున్నాడు.


Tags:    

Similar News