తమిళ నిర్మాతల మండలిలో ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదాలు, విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పై గత కొన్నాళ్లుగా కొందరు నిర్మాతలు ఒక్కరొక్కరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. విశాల్ కేవలం పెద్ద నిర్మాతలకు మద్దతుగా మాత్రమే ఉంటున్నాడని, ఆయన నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయంటూ తాజాగా 50 మంది నిర్మాతలు నిర్మాతల మండలి వద్ద దర్నాకు దిగారు.
సినిమాల విడుదల విషయంలో చిన్న నిర్మాతలకు విశాల్ నుండి ఏమాత్రం సహకారం అందడం లేదని, ఆయన వల్ల చిన్న సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి లేకుండా పోయిందంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా సమయం నిర్మాతల మండలి ముందు ఆందోళనకు దిగిన దాదాపు 50 మంది నిర్మాతలు ఆ తర్వాత నిర్మాతల మండలి ఆఫీస్ కు తాళం వేసి ఆ తాళంను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. విశాల్ తో మాట్లాడాలని వారు డిమాండ్ చేసినా కూడా విశాల్ మాత్రం అందుబాటులో లేడని వారికి ఆఫీస్ వర్గాల వారు సమాధానం ఇచ్చారు.
నడిగర్ సంఘం మరియు నిర్మాతల మండలిని తన చేతుల్లో పెట్టుకుని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అంటూ గత కొంత కాలంగా కొందరు నిర్మాతలు ఆయన్ను విమర్శిస్తున్నారు. అయితే విశాల్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది మాత్రం ఎవరు ఊహించలేదు. 50 మంది నిర్మాతలు బయటకు వచ్చి ఆందోళన చేయడంతో తమిళ సినీ రంగం మొత్తం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ విషయమై విశాల్ ఎలా రియాక్ట్ అవుతాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు. 2017లో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశాల్ పైరసీపై పెద్ద ఎత్తున యుద్దమే చేస్తున్నాడు. కాని చిన్న నిర్మాతలను మాత్రం ఆయన పట్టించుకోలేదనేది విమర్శ.