అసలే తెలుగు ప్రజలకు సినిమాలంటే ప్రాణం. ఒకే రోజున మూడు నాలుగు సినిమాలు చూసే వాళ్లు ఉన్నారు. అలాంటిది సినిమా థియేటర్ల బంద్ చేస్తే సినీ జనాలు ఏమైపోవాలి. వారికి లైఫ్ బోర్ కొట్టేయదూ... నాలుగు రోజులుగా థియేటర్లు మూతబడ్డాయి. అతి త్వరలో వాటిని తెరిచేస్తున్నారని సమాచారం.
సర్వీస్ ప్రొవైడర్లు అండ్ చిత్ర నిర్మాతల మధ్య తలెత్తిన వివాదమే... థియేటర్ల బంద్‌కు దారి తీసింది. యూఎఫ్‌వో... క్యూబ్ సంస్థలు వసూలు చేస్తున్న రేట్లు పూర్తిగా ఎత్తివేయాలని నిర్మాతలు కోరుతున్నారు. అందుకు సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పుకోవడం లేదు. 9 శాతం మేర తగ్గిస్తామని చెప్పారు. అందుకు చిత్ర నిర్మాతలు ఒప్పుకోలేదు. అందుకే ఇవాళ మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో సర్వీస్ ప్రొవైడర్లు అండ్ నిర్మాతల మధ్య చర్చలు సాగాయి. ఆ చర్చల్లో ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. డిజిటల్ ప్రింట్ కోసం వసూలు చేసి వర్చువల్ ప్రింట్ ఫీ ఇప్పుడు 17% తగ్గిస్తామని అంగీకరించాయి డిజిటల్ సంస్థలు. అందుమేరకు తగు ఎగ్రిమెంట్లు రెడీ చేసి వెంటనే ఎగ్జిబిటర్లు నిర్మాతలు సంతకాలు చేసేస్తే.. మళ్ళీ రేపటి నుండి నుంచి థియేటర్లు కళకళలాడేస్తాయి.
ఈ మార్చి 2న బంద్‌కు పిలుపునిచ్చింది నిర్మాతల మండలి. అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ మూతబడ్డాయి. ఇక తమిళనాడు... కేరళ... కర్ణాటక నిర్మాతల మండలి బంద్‌కు మద్దతు నిచ్చాయి కానీ థియేటర్లు మూసివేయలేదు. అలా చేస్తే చిన్న నిర్మాతలు నష్టపోతారని వారు అభిప్రాయపడ్డారు. దీంతో బంద్ విషయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకాకి అయిపోయింది.