ఆ పూజ డైరక్టు తెలుగు సినిమా

Update: 2017-06-05 10:33 GMT
కమల్ హాసన్ విశ్వరూపంలో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ పూజ కుమార్ ఆ తరవాత మళ్ళీ పెద్దగా మరే సినిమాలలో కనిపించలేదు. మళ్ళీ అదే కమల్ తో ఉత్తమ విలన్ లో నటించి అందరినీ ఆమె అందం అభినయం కలబోసి అదరగొట్టింది. కాకపోతే ఈ రెండు సినిమాలు తెలుగు సినిమాలు కాకపోవడంతో ఈమెకు ఇక్కడ అంతా క్రేజ్ లేదు. ఇప్పుడు అందుకే డైరక్టు తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులును పలకరించడానికి వస్తోంది ఈ మాజీ మిస్ ఇండియా అమెరికా.

హీరో రాజశేఖర్ నటిస్తున్న ‘పి‌ఎస్‌ వి గరుడవేగ’ సినిమాలో పూజ కుమార్ వర్కింగ్ ఉమెన్ లా.. ఆరేళ్ల పిల్లకు తల్లిగా.. ఇంటిలో సాదించే పెళ్ళాం లా ప్రేమనుపంచే స్త్రీమూర్తిగా ఇలా చాలా కోణాలు ఉన్న పాత్ర చేస్తోందట. ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. “పూజ కుమార్ విశ్వరూపం, ఉత్తమ విలన్ చూసిన తరవాత ఈ పాత్ర ఈమె అయితేనే నటించగలదు అనిపించింది. అందుకే పూజను కాస్ట్ చేశాం. ఈ సినిమాలో ఆమె నటన సినిమాకు చాలా బలాన్ని ఇచ్చింది'' అంటున్నాడు దర్శకుడు. ఇక పూజతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రద్దా దాస్ కూడా నటిస్తోంది.

కాకపోతే విచిత్రం ఏంటంటే.. PSV గరుడ వేగ 126.18M అనే ఈ సినిమాను మనోళ్లు 25 కోట్ల పై బడ్జెట్ తో రూపొందించాం అంటున్నారు. అంత డబ్బులు పెట్టినప్పుడు ఇలాంటి ఆఫ్‌-బీట్ క్యాస్టింగ్ ఏంటి అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కేవలం రాజశేఖర్.. ఆ తరువాత సన్ని లియోన్ తప్పితే.. ఈ బడ్జెట్ లో అందరూ యావరేజ్ నటీనటీలను తీసుకున్నట్లు అనిపించట్లేదూ? వాటే క్యాస్టింగ్ కహానీ గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News