మరో రెండు సినిమాలకు కూడా పూరి జోహార్‌

Update: 2020-06-09 17:05 GMT

ఇస్మార్ట్‌ శంకర్‌ తో ఫామ్‌ లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ఒక యాక్షన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను ముంబయి బ్యాక్‌ డ్రాప్‌ గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి చేసిన పూరి త్వరలోనే మళ్లీ షూటింగ్‌ పూర్తి చేసి ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ అయిన కరణ్‌ జోహార్‌ మొదటి సారి ఈ చిత్రంతో తెలుగులో అడుగు పెట్టబోతున్నాడు. పాన్‌ ఇండియా లెవల్‌ లో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. కరణ్‌ జోహార్‌ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు పూరి దర్శకత్వంలో మరో రెండు సినిమాలను నిర్మించేందుకు కరణ్‌ జోహార్‌ ఒప్పందం చేసుకున్నాడట.

పూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాతో పాటు ఆ తర్వాత రెండు సినిమాలు కూడా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యాయి. మూడు సినిమాలు కూడా పాన్‌ ఇండియా సినిమాలుగా పూరి ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకే పూరి నిర్మాణ సంస్థతో కలిసి ఆ రెండు సినిమాలను కూడా ధర్మ ప్రొడక్షన్స్‌ లో కరణ్‌ జోహార్‌ నిర్మించేందుకు ఇప్పటికే ప్లాన్‌ చేశాడట. ఆ రెండు సినిమాలకు కథలు కూడా ఓకే అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News