టాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందు చెప్పుకోవాలి. చాలా మంది దర్శకులు చెప్పిన తేదీకి సినిమా పూర్తి చేయలేక రిలీజ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి కల్పిస్తారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం అనుకున్న దాని కంటే ముందే సినిమాను ముగించి రిలీజ్ ప్రిపోన్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాడు. నందమూరి బాలకృష్ణతో చేస్తున్న ‘పైసా వసూల్’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే నెల రోజుల ముందే పూర్తవుతుండటం విశేషం. ఇప్పటికే దాదాపుగా సినిమాను పూర్తి చేసిన పూరి డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టేయడం విశేషం. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులూ మొదలయ్యాయి.
‘పైసా వసూల్’ షూటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. సెప్టెంబరు రెండో వారానికి ఈ సినిమా తొలి కాపీ రెడీ చేయాలన్నది షూటింగ్ మొదలవడానికి ముందు పెట్టుకున్న డెడ్ లైన్. కానీ ఇప్పుడు ఆగస్టు 15కు డెడ్ లైన్ మారిపోయింది. ఆ రోజుకల్లా ఫస్ట్ కాపీ చేతిలో పెడతానని నిర్మాత ఆనంద్ ప్రసాద్ హామీ ఇచ్చాడట పూరి. అందుకనుగుణంగానే పనులు జరుగుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకున్నప్పటికీ పూరి ఏమాత్రం కంగారు పడకుండా గత వారం రోజుల్లో చకచకా షూటింగ్ కానిచ్చేసినట్లు సమాచారం. ఈ కేసు విషయలో తనకేదైనా ఇబ్బంది ఎదురైనప్పటికీ సినిమాపై ఆ ప్రభావం పడకుండా చూసుకుంటున్నాడు పూరి. దసరాకు పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆగస్టు 15కు సినిమా రెడీ అయిపోతే.. సెప్టెంబరు చివరి వారం వరకు ఎదురు చూడకుండా కొన్ని వారాల ముందే సినిమాను రిలీజ్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారట.