అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప పార్ట్ 1 కి కొన్ని ఏరియాల్లో అనుకున్న దాని కంటే రెట్టింపు.. మూడు రెట్ల వసూళ్లు అధికంగా వచ్చాయి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా పుష్ప సినిమాను ఆదరించారు. ఇప్పుడు అంతా కూడా పుష్ప పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. భారీ వసూళ్లు నమోదు చేసిన పుష్ప పార్ట్ 1 కథ కొనసాగింపుగా పార్ట్ 2 ను తెరకెక్కించబోతున్నారు. పుష్ప కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుండి కథ ప్రారంభించేలా పార్ట్ 2 కి సంబంధించిన కథను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగిందని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు.
సుకుమార్ ఈ స్క్రిప్ట్ ను మొదట కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం అన్నట్లుగానే తయారు చేయడం జరిగిందట. ఆ విషయాన్ని స్వయంగా సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పార్ట్ 2 కథ ఖచ్చితంగా పాన్ ఇండియా అప్పీల్ ను కలిగి ఉండాలి. పార్ట్ 1 లక్కీగా పాన్ ఇండియా మూవీగా నిలిచి ఘన విజయం దక్కించుకుంది. ప్రతి సారి లక్ కలిసి రావడం అంటే ఖచ్చితంగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే పుష్ప పార్ట్ 2 కోసం కథ రెడీ చేసిన కథలో మార్పులు చేర్పులు చేయడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందుకే పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ టీమ్ మరియు బాలీవుడ్ కు చెందిన ఒక టీమ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే మార్పు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
పుష్ప పార్ట్ 2 పై ఉన్న భారీ అంచనాలు సుకుమార్ పై ఒత్తిడి పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఒక వైపు హీరో అల్లు అర్జున్ టీమ్ మరియు నిర్మాతల టీమ్ దర్శకుడు సుకుమార్ ను పాన్ ఇండియా మూవీగా పుష్ప పార్ట్ 2 ను మల్చాలనే ఉద్దేశ్యంతో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందట. కాని ఆయన వాటిని ఎలా స్వీకరిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. పుష్ప పార్ట్ 2 కు సంబంధించిన చిత్రీకరణ మార్చి లో మొదలు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు.
స్క్రీప్ట్ లో మార్పులు చేస్తే ఖచ్చితంగా సమయం ఎక్కువ కావాలి. కానీ మేకర్స్ మాత్రం మార్చిలో మొదలు పెట్టి డిసెంబర్ లోనే సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు కనుక స్క్రిప్ట్ మార్పులు ఉండక పోవచ్చు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే కొద్దిలో కొద్దిగా అయినా ముందుగా అనుకున్న విధంగా కాకుండా మార్చే అవకాశం ఉందని మీడియా వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.