అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ముగిసినట్లుగా సమాచారం అందుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు సుకుమార్ చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని బన్నీ.. రష్మిక.. సునీల్.. అనసూయల లుక్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. పాటలు ఇప్పటికే మంచి సక్సెస్ అయ్యాయి. ముందు ముందు సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో అనిశ్చితి నెలకొంది.
డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అదే తేదీకి మేకర్స్ కట్టుబడి ఉన్నారు. కాని పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయాలంటే ఇతర భాషల్లో సమస్యలు ఉన్నాయి. అక్కడ అదే తేదీకి విడుదల చేయడానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాయిదా ఉత్తమం అనే చర్చ కూడా జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అల్లు అర్జున్ అండ్ టీమ్ మాత్రం పుష్ప సినిమా ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయంకు వస్తుంది. డిసెంబర్ లో పుష్ప అనుకున్న తేదీకి వచ్చేయబోతుందని అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయని అంటున్నారు. అల్లు అర్జున్ విడుదల విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా ఉన్నారంటూ సమాచారం అందుతోంది.
ఎంత పోటీ ఉన్నా.. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పుష్ప విడుదల తథ్యం అంటూ అల్లు అర్జున్ టీమ్ నమ్మకంగా చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల కూడా స్మూత్ రిలీజ్ అయితే బాగుంటుందని కొందరు అభిమానులు ఆశ పడుతున్నారు. కాని కరోనా వల్ల అన్ని భాషల్లో కూడా చాలా సినిమాలు వాయిదా పడి ఇప్పుడు ఒక్కసారిగా వస్తున్నాయి. పరిస్థితులు స్మూత్ అవ్వడంకు కనీసం మూడు నాలుగు నెలల సమయం అయినా పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం కంటే పుష్పను ఏదో విధంగా ఇప్పుడు విడుదల చేయడం ఉత్తమం అనేది ఇండస్ట్రీ వర్గాలు మరియు అభిమానుల టాక్. చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా అదే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప రిలీజ్ నూటికి నూరు శాతం ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 17న ఉంటుందని మాకు సమాచారం అందుతోంది.