డబుల్‌ ధమాకా.. పుష్ప 2 మొత్తం మార్చేశారు!

Update: 2022-06-06 11:31 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్‌ గా నిలవడంతో పుష్ప 2 పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప పార్ట్‌ 1 విడుదల అయిన రెండు నెలల్లోనే పార్ట్‌ 2 షూటింగ్ ను మొదలు పెట్టాలని యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. పుష్ప పార్ట్‌ 1 విడుదల సమయంలో అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కాని ఆరు నెలలు అవుతున్నా ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.

పుష్ప పార్ట్‌ 2 ను బాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. పుష్ప 2 కోసం స్క్రిప్ట్‌ పార్ట్‌ 1 విడుదలకు ముందే రెడీగా ఉంది. కాని ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌ ను పూర్తిగా మార్చేసి కొత్త స్క్రిప్ట్‌ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌ అభిమానులకు డబుల్‌ ధమాకా అన్నట్లుగా పుష్ప 2 లో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. మొదటి పార్ట్‌ ఎక్కడైతే పూర్తి అయ్యిందో అక్కడ నుండి మళ్లీ పార్ట్‌ 2 కథ ప్రారంభం అవుతుంది. కాల క్రమేనా పుష్ప వేల కోట్ల ఆస్తులు సంపాదించి అండర్‌ వరల్డ్‌ డాన్ గా మారుతాడు. ఆయన తనయుడు మరో అల్లు అర్జున్‌ పాత్ర ను కొత్తగా డిజైన్‌ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 సినిమా గురించి ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అందులో ఏవి నిజం.. ఏవి అబద్ధం అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. ఈ కొత్త పుకార్లలో నిజం ఎంత అనే విషయం పై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఒక వేళ బన్నీ డబుల్‌ రోల్‌ లో పుష్ప 2 లో కనిపిస్తే ఖచ్చితంగా అది అభిమానులకు పండుగే.

ఇదే సమయంలో బాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం ఇప్పటికే సక్సెస్ అయిన పుష్ప ను పుష్ప 2 పేరుతో నాశనం చేస్తున్నారా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ మరియు సుకుమార్‌ ల నుండి రాబోతున్న పుష్ప 2 ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌ లో వస్తుందని మొన్నటి వరకు అన్నారు. కాని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే. బాలీవుడ్‌ కు చెందిన ఒక స్టార్ నటుడు పుష్ప 2 లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా పుష్ప 2 లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News