పీవీపీ.. ఈసారైనా గ‌ట్టెక్కుతాడా?

Update: 2017-02-19 13:07 GMT
ఇండస్ట్రీలో చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు పొట్లూరి వరప్రసాద్. ఆయన తొలి సినిమా ‘బలుపు’ మంచి విజయమే సాధించింది కానీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో చాలా వరకు డిజాస్టర్లయ్యాయి. వర్ణ.. సైజ్ జీరో.. బ్రహ్మోత్సవం.. కాష్మోరా.. ఈ సినిమాలన్నీ ఆయనకు భారీ నష్టాలే తెచ్చిపెట్టాయి. ఆయనకు ఇప్పటిదాకా మంచి లాభాలు అందించిందంటే ఒక్క ‘క్షణం’ మాత్రమే. పీవీపీ బేనర్ నుంచి ఏదైనా భారీ సినిమా వస్తోందంటే.. జనాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ‘ఘాజీ’ పీవీపీకి గొప్ప ఊరటే ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా నేపథ్యం.. ఆ భారీతనం అదీ చూసి పెట్టుబడి భారీ మొత్తమే అయి ఉంటుందని అంచనా వేశారు. మీడియాలో దీని బడ్జెట్ రూ.100 కోట్లని వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమాకు రూ.40 కోట్లకు అటు ఇటుగానే ఖర్చయిందని సమాచారం.

కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి సబ్ మెరైన్ మీద ఉన్న అవగాహన.. అతడి టీం సభ్యుల పనితనం కలిసొచ్చి తక్కువ ఖర్చులోనే సినిమా పూర్తి చేశారట. సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లోనూ దాదాపు సొంతంగానే రిలీజ్ చేసుకున్నాడు పీవీపీ. హిందీలోనూ కరణ్ జోహార్ పేరు ముందు పెట్టి పీవీపీనే సొంతంగా రిలీజ్ చేశారట. మంచి బిజినెస్ ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదట. ఇలా చేయడం రిస్క్ అన్నారు కానీ.. ఇప్పుడు సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటం.. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల్లో బాగానే క‌లెక్ష‌న్లు వ‌స్తుండ‌టంతో పీవీపీ లాభాలు అందుకునే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లకు కూడా భాగస్వామ్యం ఉన్నప్పటకీ పీవీపీ వాటానే ఎక్కువ. ఆయన గత సినిమాల నష్టాల్ని కొంత వరకు పూడ్చుకునే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News