ఐషుతో ఎఫైర్ గురించి ప్ర‌శ్న‌.. మాజీ ఫైరింగ్!!

Update: 2022-12-16 08:30 GMT
వివేక్ ఒబెరాయ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హిందీ చిత్ర‌సీమ‌లో త‌న‌దైన ప్ర‌తిభ‌తో మెప్పించిన‌ ఈ న‌టుడు టాలీవుడ్ కి సుప‌రిచితుడు. భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ లో అత‌డు క‌థానాయ‌కుడిగా న‌టించాడు. రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ లోను కీల‌క పాత్ర‌ను పోషించి మెప్పించాడు. సౌత్ లో ప‌లు భారీ చిత్రాల్లో ఇంపార్టెంట్ పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాడు. సూర్య‌- అజిత్ లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించాడు. అయితే ఒకానొక‌ప్పుడు అత‌డు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ తో వైరం  కొన‌సాగించ‌డం అత‌డి కెరీర్ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింద‌ని క‌థ‌నాలొచ్చాయి. నేడు అగ్ర క‌థానాయ‌కుల‌లో ఒక‌డిగా హ‌వా సాగించాల్సిన ఒబేరాయ్  కెరీర్ దెబ్బతింది. దీనికి ఒక ప్ర‌త్యేక కార‌ణం కూడా ఉంది.

కెరీర్ ప‌రంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్ర‌మంలోనే ఒబేరాయ్ నిరంత‌రం ఎఫైర్ల‌తో వార్త‌ల‌కెక్కాడు. ఆ సమయంలో మాజీ ప్ర‌పంచ‌సుంద‌రి ఐశ్వర్యరాయ్ తో డేటింగ్ లో ఉన్నాడు. ఓ వివాదంలో సల్మాన్ కు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం నిర్వహించాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బాలీవుడ్ వెబ్ సైట్ ఐశ్వర్యరాయ్ తో డేటింగ్ గురించి అడిగింది.  ఇది వివేక్ కు న‌చ్చ‌లేదు. అంతేకాదు అది అత‌డి త‌దుప‌రి కెరీర్ కి ఇబ్బందుల‌ను క‌ల‌గజేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇప్పుడు కూడా ఆ అర్థంకాని ఠిఫిక‌ల్ ప్రశ్న అడిగినందుకు ఓ ఇంటర్వ్యూయర్ పై వివేక్ ఒబేరాయ్ మండిపడ్డారు. ఒబేరాయ్ గొప్ప ప్ర‌తిభావంతుడు. బాలీవుడ్ లో ఎన్నో ప్రామిస్సింగ్ చిత్రాల‌తో నిరూపించుకున్నాడు. తెలుగులో ర‌క్త చ‌రిత్ర చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సినిమాలు OTT షోలు చేస్తూ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఐశ్వ‌ర్యారాయ్ బిగ్ బి వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ని పెళ్లాడి ఆరాధ్య‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పీఎస్ 1లో న‌టించి మెప్పించారు. త‌దుప‌రి సీక్వెల్లోను ఐష్ న‌టిస్తోంది. బాలీవుడ్ లోను త‌న కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని స‌మాచారం.

టాలీవుడ్ తో ఒబెరాయ్ బంధం వివేక్ ఒబెరాయ్ టాలీవుడ్ లోను ఘ‌న‌మైన ఆరంగేట్రం చేసిన హిందీ న‌టుడు. సీమ‌ ఫ్యాక్ష‌నిస్ట్ గా పాపుల‌రైన దివంగ‌త‌ రాజ‌కీయ నాయ‌కుడు ప‌రిటాల ర‌వి జీవిత‌క‌థ ఆధారంగా రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన 'రక్త చరిత్ర'తో అత‌డు తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఈ చిత్రం తెలుగు- తమిళం- హిందీ భాషలలో రెండు భాగాలుగా విడుద‌లైంది. ఈ చిత్రం రాజకీయ నాయకుడైన పరిటాల రవి అత‌డి విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించారు. ఇది అధికారికంగా 2010 ఆగస్టు నెలలో విడుదల కావలసి ఉన్నా కానీ 2010 అక్టోబరు 22న విడుదలైంది. హిందీలోను 'రక్త‌చరిత్ర' టైటిల్ తోనే విడుదలైంది. ఆ త‌ర్వాత కొన‌సాగింపు భాగాన్ని ఆర్జీవీ విడుద‌ల చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News