ఎన్టీఆర్‌ షో లో కోటి గెలుచుకున్న వ్యక్తి ఎదుర్కొన్న ప్రశ్నలు.. చెప్పిన సమాధానాలు

Update: 2021-11-16 04:56 GMT
జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగింపు దశకు వచ్చింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ఈ షో లో ఇప్పటి వరకు ఎవరు కోటి గెలుచుకోలేదు. గత సీజన్ ల్లో కూడా ఎవరు కోటి రూపాయల వరకు వెళ్లలేదు. కాని మొదటిసారి తెలంగాణ పోలీసు శాఖకు చెందిన సబ్ ఇన్సిపెక్టర్‌ రాజా రవీంద్ర కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఆయన గేమ్ గురించి గత రెండు మూడు రోజులుగా జనాల్లో చాలా చర్చ జరుగుతోంది.

రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న ఎపిసోడ్ లు ప్రసారం అవుతున్నాయి. నిన్న రాజా రవీంద్ర ఆట మొదలు అయ్యింది. అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు స్పీడ్ గా సమాధానాలు చెబుతూ వచ్చాడు. నవంబర్‌ 15వ తారీకున అంటే సోమవారం ఆయన గేమ్ కు సంబంధించిన ఎపిసోడ్‌ ప్రసారం అవ్వగా.. ఆట రెండవ రోజు కూడా కొనసాగించబోతున్నారు. 16వ తారీకున కోటి రూపాయల ప్రశ్నకు సంబంధించిన ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవ్వబోతుంది. కోటి వరకు వెళ్లేందుకు రాజా రవీంద్ర ఎదుర్కొన్న ప్రశ్నలు ఏంటీ.. వాటికి అతడు ఇచ్చిన సమాధానాలు ఏంటీ అనేది ఇప్పుడు చూద్దాం.

ఫాస్టెస్ట్‌ ఫింగర్ ఫాస్ట్‌ ప్రశ్న : హైదరాబాద్ నుండి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కవకు అమర్చండి
న్యూయార్క్‌
ముంబై
దుబాయి
విజయవాడ
ఈ ప్రశ్నకు కేవలం 2.6 సెకన్ల లో రాజా రవీంద్ర సరైన సమాధానం పెట్టి హాట్ సీట్ కు చేరాడు. అతడి స్పీడ్‌ చూసి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్య పోయాడు. షూటింగ్‌ లో జాతీయ స్థాయిలో పలు విజయాలను దక్కించుకున్న రాజా రవీంద్ర ఆటను ప్రకటించాడు.

రూ.1000ల ప్రశ్న.. సాదారణంగా వీటిల్లో దేనిమీద చెల్లుబాటు తేదీ ఉండదు.
ఆధార్‌ కార్డు
పాస్ పోర్టు
డెబిట్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్

సమాధానం : ఆధార్ కార్డు

రూ.2000 ప్రశ్న.. ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారు ఎవురు
మహా వీర
బాహుబలి
బుద్దుడు
గురునానక్‌

సమాధానం  :   బుద్దుడు

రూ.3000 ప్రశ్న... భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని
ఒకటి
రెండు
మూడు
నాలుగు

సమాధానం  :   ఒకటి

రూ.5000 ప్రశ్న.. 2019 లో భారత హోం శాఖమాత్యులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు
నిర్మలా సీతారామన్‌
నితిన్ గడ్కారీ
రవిశంకర్‌ ప్రసాద్‌
అమిత్ షా

సమాధానం  :   అమిత్‌ షా

రూ.10000 ప్రశ్న... వీటిలో కత్తి సాము.. సిలంబం.. కలరిపయట్టు అనేవి దేనికి ఉదాహరణలు
నృత్యం
సంగీతం
చిత్రలేఖనం
మార్షల్ ఆర్ట్స్‌

సమాధానం  :   మార్షల్ ఆర్ట్స్

రూ. 20000 ప్రశ్న... రేడియో ప్రసారాల్లోని ఏఎమ్‌.. ఎఫ్‌ఎమ్‌ ల్లో ఎమ్‌ దేనిని సూచిస్తుంది
మీటర్
మాడ్యులేషన్‌
మాగ్నిట్యూడ్‌
మిషన్‌

సమాధానం  :   మాడ్యులేషన్

రూ.40000 ప్రశ్న.. వీటిలో ఏపీలోని అంతర్వేది వద్ద బంగాళకాతంలో కలిసే నది ఏది
కృష్ణ
తుంగభద్ర
పెన్నా
గోదావరి

సమాధానం  :   గోదావరి

రూ.80000 ప్రశ్న... ఏ మానవ అవయవాల్లో ఐరిస్‌.. లెన్స్‌.. రెటీనా ఉంటాయి
ఊపిరితిత్తులు
చెవులు
కళ్లు
కడుపు

సమాధానం  :   కళ్లు

రూ. 160000 ప్రశ్న.. హిందూ పురాణాల్లో వీరిలో కర్ణుడి గురువు ఎవరు?
వ్యాసుడు
పరశురాముడు
పాండు రాజు
కృష్ణుడు

సమాధానం  :   పరశురాముడు

రూ. 320000 ప్రశ్న.. ఆగస్టు 2021 లో ఆపరేషన్‌ దేవిశక్తి లో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం 800 మంది జనాన్ని తరలించింది
అఫ్ఘనిస్తాన్‌
ఇరాక్
సిరియా
మయన్మార్‌

సమాధానం  :   అప్ఘనిస్తాన్‌

రూ. 640000 ప్రశ్న.. భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు బ్రిటీష్ వైస్రాయ్‌ గా ఉన్నది ఎవరు?
లార్డ్‌ వేవెల్‌
లార్డ్ మౌంట్ బాటెన్
లార్డ్‌ ఎల్గిన్‌
లార్డ్‌ రిప్పన్‌

లార్డ్‌ మౌంట్ బాటెన్‌

రూ. 1250000 ప్రశ్న.. ఒకే పారా ఒలింపిక్స్ లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు
అవనీ లేఖరా
దీపా మాలిక
అంజలీ భగవత్‌
భవీనా పటేల్‌

సమాధానం  :   అవనీ లేఖరా

పాతిక లక్షల ప్రశ్నకు వెళ్లే ముందు సోమవారం ఎపిసోడ్ టైమ్‌ అయ్యింది. మంగళ వారం ఎపిసోడ్‌ లో ఆ ప్రశ్న ఎన్టీఆర్‌ అడుగబోతున్నాడు. మరో మూడు ప్రశ్నల దూరంలో కోటి రూపాయలు రాజా రవీంద్రకు ఉన్నాయి. ఆ మూడు ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు చెప్పాడని ఇప్పటికే తెలిసినా కూడా ఎపిసోడ్‌ పై చాలా ఆసక్తి కనిపిస్తోంది.
Tags:    

Similar News