టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో రాశి ఖన్నా పేరు ప్రముఖంగానే వినిపించేస్తోంది. రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అనే స్టాంప్ ఇప్పటికే పడిపోయింది. అమ్మడి 'జోరు' చూస్తే ఆ మాటలో అసత్యం ఏం లేదని ఒప్పుకోవాల్సిందే.
ఢిల్లీలో సెటిల్ అయిన పంజాబీ బ్యూటీ రాశిఖన్నా హిందీలో మద్రాస్ కేఫ్ లో నటించగా.. అక్టోబర్ 2013లో టాలీవుడ్ కి తెచ్చాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. ఊహలు గుసగుసలాడే అంటూ తన తొలి చిత్రంతోనే సత్తా చాటిన ఈ భామకు.. తొలి సినిమా రిలీజ్ కోసం 8 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక సారి ఊహలు గుసగుసలాడే థియేటర్లలోకి వచ్చాక ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. జోరు.. జిల్.. శివం.. బెంగాల్ టైగర్.. సుప్రీమ్.. అంటూ వరుసగా సినిమాలు చేసేయగా.. గోపీచంద్ తో ఆక్సిజన్.. రామ్ తో చేస్తున్న హైపర్ లు రిలీజ్ కి రెడీ అయిపోయాయి.
మొదటి సినిమా రిలీజ్ అయ్యాక రెండేళ్లలోనే 7 సినిమాలు చేసేసింది రాశి ఖన్నా. ఎంత స్పీడ్ చూపించినా.. తనకు రేసులపై పెద్దగా నమ్మకం లేదంటున్న ఈ భామ.. తన స్పీడ్ లోనే వెళతానని.. ఎవరితోనూ పోటీ పడబోనని చెప్పేసింది. 'టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి అభిమానాన్ని ఊహించలేదు. త్వరలో తమిళ్ కు వెళుతున్నా.. అక్కడి ఆడియన్స్ కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా' అంటోంది రాశిఖన్నా.