అందానికి అందం ప్రతిభతో కెరీర్ లో నిలదొక్కుకుని నెమ్మదిగా తన ప్రయాణం సాగిస్తోంది రాశీఖన్నా. ఈ దిల్లీ బ్యూటీ ఆరంభం పరాజయాలతో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. సరైన హిట్టు లేకపోయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎంతో ఒద్దికగా డౌన్ టు ఎర్త్ స్వభావంతో మన మేకర్స్ నుంచి అవకాశాలు అందుకుంటోంది.
అయితే ఇటీవలి కాలంలో రాశీ ఖన్నాపై ఎవరో బురద జల్లుతున్నారట. తనపై తప్పుడు కథనాల్ని ప్రచురిస్తున్నారని.. దయచేసి అలాంటి దురంధరులు వాటిని ఆపేయాలని రాశీ రెక్వస్ట్ చేసింది. తనకు అన్ని భాషల్లోనూ నటించాలనుందని దయచేసి అలాంటి వార్తలు రాయొద్దని అంది. ఇక ఈ ట్వీట్ తో పాటే మరో పంచీ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది.
ఈ ఫోటోగ్రాఫ్ లో రాశీ ట్రిమ్డ్ అండ్ టోన్డ్ బాడీ లాంగ్వేజ్ ఆశ్చర్యపరుస్తోంది. జిమ్ లో కసరత్తులు చేసి లేడీ టైగర్ లా తయారైంది. బైసెప్ ట్రైసెప్ షోల్డర్ భాగంలో మెలితిరిగిన ఆకృతి రాశీని ఫిట్ గా ఆవిష్కరిస్తోంది. ఎంతగా అంటే తన ముందు ఎవరైనా శత్రువు నిలబడితే క్షణకాలంలో పిడిగుద్దులతో మట్టి కరిపించేంత స్టామినా కనిపిస్తోంది. రాశీలో కాన్ఫిడెన్స్ లెవల్ ఎంత? అని ప్రశ్నిస్తే.. తనే సమాధానమిచ్చింది.
స్ట్రాంగర్ ఎవ్వెరి డే.. రెడీ టు కిక్ సమ్.. ఆవ్!! అంటూ కండలు పెంచుతున్న ఈమోజీని షేర్ చేసింది. మొత్తానికి కిక్ లు పంచ్ లతోనే రాశీ మట్టి కరిపించేంతటి బలశాలిగా మారిందన్నమాట. కరోనా క్రైసిస్ కాలాన్ని రాశీ ఖన్నా సద్వినియోగం చేసుకుని తన రూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఇటీవలి కాలంలో వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాల్లో నటిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రాశి ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోంది. ఇందులో తమిళ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో పక్కా కమర్షియల్ .. థ్యాంక్యూ తన కెరీర్ కి ఎంతో కీలకం కాగా.. హిందీలో యోధాతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఫ్యామిలీమ్యాన్ రాజ్ అండ్ డీకేలతో సిరీస్ లు చేస్తూ కెరీర్ ని పెద్దగానే ప్లాన్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. మునుముందు రాశీని `పాన్ ఇండియా రాశీ` అని పిలిచే రోజొస్తుంది!