పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ `రాధేశ్యామ్`. పిరియాడిక్ లవ్ స్టోరీగా అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీని రాధా కృష్ణకుమార్ తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంస్థ లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, ఒమిక్రాన్, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` మూవీ రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయినా సరే `రాధేశ్యామ్` వెనక్కి తగ్గేది లేదంటూ చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
దీంతో `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నా `రాధేశ్యామ్` మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ `రాధేశ్యామ్` రిలీజ్ కూడా వాయిదా పడుతోందంటూ వరుస కథనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా సమావేశాలని ప్లాన్ చేసుకున్న ప్రభాస్ తాజాగా వాటిని క్యాన్సిల్ చేసినట్టుగా తెలిసింది. దీంతో `రాధేశ్యామ్` విడుదల విషయంలో వస్తున్న వార్తలు నిజమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు విషయం తెలిసిపోయింది కాబట్టే మీడియా ఇంటరాక్షన్ ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న మీటింగ్ లని అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్, కరోనా కేసుల దృష్ట్యా `ఆర్ ఆర్ ఆర్` ని మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా `రాధేశ్యామ్` టీమ్ సైలెంట్ గా వుండి ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అంతే కాకుండా మరో సారి సంక్రాంతికే వచ్చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ తో వున్న పోస్టర్ ని విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. ఇదే తరహాలో `భీమ్లా నాయక్` రిలీజ్ జనవరి 12నే అంటూ వరుసగా ప్రకటనలు చేశారు. కానీ చివరికి సంక్రాంతి రేస్ నుంచి `భీమ్లా నాయక్` తప్పుకోవాల్సి వచ్చింది.
అదే స్టోరీ మళ్లీ `రాధేశ్యామ్` విషయంలో రిపీట్ అవుతోందని అంతా అంటున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లు మూసి వేయడం, కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ని విధించడం, ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల సమస్య ఓ కొలిక్కి రాకపోవడం వంటి కారణాలతో `రాధేశ్యామ్` రిలీజ్ కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోందని పెద్ద చర్చే నడుస్తోంది.
అయితే మేకర్స్ మాత్రం జనవరి 14న విడుదల అంటూ ఇంఆక అదే డేట్ ని పట్టుకుని నిలబడటం ఎవరికీ అర్థం కావడం లేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో `రాధేశ్యామ్` రిలీజ్ కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోందని, ఇదే విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ లో వినిపిస్తోంది.