ఆమె నాన్నకు భార్య నాకు అమ్మ కాదు

Update: 2020-03-01 01:41 GMT
హీరోయిన్‌ గా ఎన్ని సూపర్‌ హిట్స్‌ అందుకున్నా కూడా కొందరు మాత్రం నటిగా పేరు దక్కించుకోలేరు. కాని తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి మాత్రం హీరోయిన్‌ గా పలు చిత్రాల్లో నటించి సక్సెస్‌ లు దక్కించుకోవడంతో పాటు నటిగా ఎన్నో మంచి పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాను ఏది అనుకుంటే అది మొహం పైనే చెప్పగల సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్‌ గానే కాకుండా చిన్న వయసులోనే విలన్‌ గా కూడా నటించి మెప్పించిన ఘట్స్‌ ఉన్న అమ్మాయి వరలక్ష్మి. తాజాగా మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి భార్య అయిన రాధిక శరత్‌ కుమార్‌ గురించి ఆశ్చర్యకరంగా మాట్లాడటంతో పాటు అందరికి షాక్‌ ఇచ్చింది. శరత్‌ కుమార్‌ మొదటి భార్య కూతురు వరలక్ష్మి అనే విషయం తెల్సిందే. వరలక్ష్మి తలి నుండి విడిపోయిన తర్వాత రాధికను శరత్‌ కుమార్‌ వివాహం చేసుకున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో రాధిక గురించి వరలక్ష్మిని ప్రశ్నించగా చాలా తెలివిగా సమాధానం చెప్పారు. రాధికను అమ్మగా అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించగా అమ్మ ఒక్కరే ఉంటారు. నాకు మాత్రమే కాదు అందరికి ఒక్కరే అమ్మ ఉంటారు. ఆమె నాన్నకు భార్య నాకు అమ్మ కాదు అంది. అయితే నాన్న గారంటే ఎంత అభిమానం గౌరవం ఉందో ఆమె అన్నా కూడా నాకు అంతే అభిమానం గౌరవం ఉందంటూ ఆ వెంటనే కూల్‌ చేసింది. మొత్తానికి వరలక్ష్మి మాటలు చాలా తెలివిగా గడుసుగా ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News