లారెన్స్‌ కు మ‌నోళ్లు క‌నిపించ‌లేదా?

Update: 2020-04-11 04:15 GMT
రాఘ‌వ లారెన్స్‌ ను త‌మిళుడిగా ఎప్పుడూ చూడ‌లేదు తెలుగు జ‌నాలు. అత‌ను కొరియోగ్రాఫ‌ర్‌ గా పేరు తెచ్చుకుంది.. న‌టుడిగా కూడా ఎక్కువ అవ‌కాశాలు అందుకుంది.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. మెగాస్టార్ చిరంజీవి స‌హా టాలీవుడ్ లో అంద‌రూ అత‌ణ్ని అభిమానిస్తారు. ప్రేమ చూపిస్తారు. ప్రేక్ష‌కులు కూడా అత‌డిని గొప్ప‌గానే ఆద‌రించారు. లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంఛ‌న సిరీస్ సినిమాల‌న్నింటికీ తెలుగులో వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. కానీ త‌న సంపాద‌న‌లో చాలా భాగం సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించే లారెన్స్‌ కు ఎప్పుడూ తెలుగువాళ్లు గుర్తుకు రారు. ఎప్పుడూ చెన్నైలో ఉండి అక్క‌డి వారికే తోడ్పాటు అందిస్తుంటాడు. అన్ని సేవా కార్య‌క్ర‌మాలూ అక్క‌డికే ప‌రిమితం అవుతుంటాయి.

తాజాగా లారెన్స్ క‌రోనాపై పోరులో భాగంగా రూ.3 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించాడు. ఆ మొత్తాన్ని ర‌క‌ర‌కాలుగా అందించాడు. ప్ర‌దాన మంత్రి స‌హాయ నిధికి - త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి - అక్క‌డి సినీ కార్మికుల‌కు.. ఇంకా కొంద‌రికి విరాళాన్ని పంచాడు. కానీ త‌న ఎదుగుద‌ల‌లో కీల‌కంగా ఉన్న తెలుగు వారికి కానీ.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మకు కానీ ఏమీ చేయ‌లేదు. అందులో క‌నీసం ఓ ప‌ది ల‌క్ష‌లైనా త‌‌న ఆరాధ్య న‌టుడైన చిరంజీవి నేతృత్వంలో న‌డుస్తున్న టాలీవుడ్ క‌రోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ‌కు అందించి ఉండొచ్చు. కానీ అత‌డికి మ‌న‌వాళ్లు గుర్తుకు రాలేదు. ఐతే ఇంత‌కుముందు త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ కు వ‌చ్చి చిరంజీవికి తాను చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి చెబితే వెంట‌నే ఆయ‌న ప‌ది ల‌క్ష‌ల విరాళాన్ని లారెన్స్‌ కు అంద‌జేశాడు. అది గుర్తు చేసుకుని అయినా మ‌న వాళ్ల‌కు లారెన్స్ ఏ సాయం చేయ‌క‌పోవ‌డం, ట్విట్ట‌ర్ లో చిరంజీవి అదే ప‌నిగా విరాళాలు కోరుతుంటే స్పందించ‌క‌పోవ‌డం లారెన్స్ సంకుచిత‌త్వాన్ని తెలియ‌జేసేదే.  


Tags:    

Similar News