డాన్స్ మాస్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టి నటుడిగా ఆపై దర్శకుడిగా నిర్మాతగా అన్ని రకాలుగా ప్రమోషన్ అందుకుని పాస్ అయిపోయిన లారెన్స్ రాఘవేంద్ర కొత్త సినిమా కాంచన 3 ఈ నెల 19న విడుదల కానుంది. ఆ మధ్య చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి టీజర్ విడుదల చేయడం మినహాయించి ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. పైగా టీజర్ లో కొత్తగా అనిపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే అవీ లేవు.
లారెన్స్ తెల్ల గెడ్డం వేసుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ముసలి వేషం వేయడం మినహా మిగిలినదంతా రొటీన్ వ్యవహారంలా ఉంది. ట్రైలర్ వచ్చినా దానికి భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో చాలా కాలం షూటింగ్ జరుపుకున్న కాంచన 3 ద్వారా లారెన్స్ అసలు ఏం ఆశిస్తున్నాడో అంతు చిక్కడం లేదు. పైగా కాంచన పేరుతో పది భాగాలు తీసినా హిట్ అవుతాయని చెప్పడం అతని ఓవర్ కాన్ఫిడెన్స్ ని సూచిస్తోంది
లారెన్స్ మొదటిసారి ముని పేరుతో కామెడీ జానర్ టచ్ చేసినప్పుడు నిజంగా అది ట్రెండ్ సెట్టర్ అయ్యింది. తర్వాత చాలా మంది అదే బాటలో వెళ్లి సూపర్ హిట్లు డిజాస్టర్లు సమానంగా అందుకున్నారు. లారెన్స్ కూడా కాంచన పేరుతో ఒకటి గంగ పేరుతో మరొకటి చేసి కమర్షియల్ వర్క్ అవుట్ చేసుకున్నాడు. ట్రెండ్ లో అన్ని అలా నడిచిపోయాయి. స్థూలంగా అన్నింటిలో కథ ఒకటే ఉంటుంది.
ఇప్పుడు ప్రేక్షకులు మళ్ళి అదే పాత బ్రాండ్ హారర్ ని చూసేందుకు ఎంత వరకు ఇష్టపడతారు అనేది అనుమానమే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ దర్శకులు ఎవరూ ఈ జానర్ ను టచ్ చేయకపోవడమే ఉదాహరణగా చెప్పొచ్చు.అసలే నాని జెర్సికి పోటీగా వస్తున్న కాంచన 3 లేని అంచనాలను సృష్టించి ఎలా నెగ్గుకువస్తుందో చూడాలి