ఒక సామన్య కొరియోగ్రఫర్ నుండి సినీ కెరీర్ ను ప్రారంభించిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఇండియాలోనే ప్రముఖ దర్శకుడిగా గొప్ప నటుడిగా.. కొరియోగ్రఫర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. తన స్టార్ డం పెరుగుతూ వస్తున్న కొద్ది ఆయన సేవ చేయడం కూడా పెంచాడు. ప్రతి ఏడాది కోట్ల రూపాయలను తన ఛారిటీ కార్యక్రకమాల కోసం లారెన్స్ ఉపయోగిస్తాడు. ఎంతో మందికి లక్షలు కోట్ల రూపాయలతో సాయం చేసిన లారెన్స్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. కొందరు ఆయన రాజకీయాల్లో రావాలంటూ బలవంతం చేస్తున్నారు.
గతంలోనే లారెన్స్ తన రాజకీయాల గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు రాజకీయాలకు పడదంటూ పేర్కొన్నాడు. రాజకీయాల్లో ఉన్న అందరు నాకు కావాల్సిన వారే. ఎవరైనా నాకు సాయం చేస్తారు. ఎవరిని కూడా నేను హర్ట్ చేసేలా మాట్లాడను. రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అవతల వారిని నొప్పించేలా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. అయితే మా గురువు గారు రజినీకాంత్ సర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎవరిని విమర్శించకుండా రాజకీయాలు చేయగలడు. ఆయన మనస్థత్వం ప్రకారం మరెవ్వరిని విమర్శించకుండా రాజకీయాలు చేయగలడు అంటూ తాను నమ్ముతున్నాను.
రజినీకాంత్ సర్ రాజకీయాల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన పార్టీ ప్రారంభిస్తే తప్పకుండా ఆ పార్టీలో నేను నా వంతు భాగస్వామ్యం అవుతాను అంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు. రజినీ సర్ పార్టీలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేస్తానంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన చంద్రముఖి 2 సినిమాను చేస్తున్నాడు.