దెయ్యాలతో దోస్తీ వదలని లారెన్స్

Update: 2016-07-19 05:06 GMT
ప్రస్తుత తరం ఎంటర్ టైన్ మెంట్ ట్రెండ్ హర్రర్ కామెడీకి ఒకవిధంగా ఆజ్యం పోసింది రాఘవ లారెన్స్ అనే చెప్పాలి. ముని సినిమాతో ఒక పక్క హర్రర్ ని మరో వైపు కామెడీని మిక్స్ చేస్తూ అంతర్లీనంగా ఒక సోషల్ ఎలిమెంట్ ని జోడిస్తూ తెరకెక్కించిన సిరీస్ లన్నీ ఘన విజయం సాధించాయి.

లారెన్స్ మొదట్నుంచీ మాస్ - డాన్ - స్టైల్ - రెబల్ సినిమాలు తీసినా ముని సిరీస్ కి వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. ఈ ఊపులోనే లారెన్స్ మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అవి కూడా దెయ్యానికి సంబంధించిన సినిమాలు కావడం విశేషం.

ఆ మధ్య నాగ సినిమా పేరుతో లారెన్స్ విడుదల చేసిన లుక్స్ అందరినీ మెప్పించాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం ప్రీ ప్రొడెక్షన్ దశలో వుండగానే పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఈ సినిమాకు చంద్రముఖి 2(శివలింగ) అనే పేరుని ఖరారు చేసినట్టు సమాచారం.
Tags:    

Similar News