తమిళనాట హిందు దేవుళ్లను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యలు వివాదాస్పం కావడం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. తమిళనాట కొందరు పబ్లిసిటీ కోసం హిందుత్వంను ప్రశ్నించేందుకు సాహసిస్తూ ఉంటారు. తాజాగా కరుప్పర్ కూట్టమ్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. కరుప్పర్ పలు సోషల్ మీడియా వేదికపై మురుగన్ ను కించ పర్చేలా మాట్లాడటం యూట్యూబ్ వీడియోలను చేయడం చేశారు. ఇప్పటికే అందుకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో సినీ ప్రముఖులు పలువురు కరుప్పర్ కూట్టమ్ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయంను తెలియజేస్తున్నారు.
ఆ వివాదంపై లారెన్స్ స్పందిస్తూ... వారి పేర్లను చెప్పడం వల్ల వారికి పబ్లిసిటీ కల్పించాలని కోరుకోవడం లేదు. ఆ సంస్థ తీరు దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో మురుగన్ భక్తులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మురుగన్ శక్తి ఏమిటో సమయమే తెలియజేస్తుంది. వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. అప్పటి వరకు భక్తులు సహనంతో ఎదురు చూడాల్సిందేనని లారెన్స్ అన్నాడు.
కరుప్పర్ కూట్టమ్ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు ను ఉన్నత స్థాయి అధికారులు విచారిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ విషయమై స్పందించడంతో కేసు తీవ్రత మరింత ఎక్కువ అయ్యిందని చెప్పుకోవచ్చు. మురుగన్ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలడు అని అందరికి తగిన శిక్ష విధిస్తాడంటూ దర్శకుడు గౌరవ్ ఒక వీడియోలో పేర్కొన్నాడు.