యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ సినిమా లు మరియు రాజకీయం రెండు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మద్య మద్యలో టీవీ షో కూడా చేస్తున్నారు. మొత్తానికి కమల్ హాసన్ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఖైదీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని మాస్టర్ తో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ను ఎంపిక చేసినట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
నటుడిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నలారెన్స్ హీరోగా పలు సినిమాలు చేశాడు. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఆయన అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడనే ఉద్దేశ్యంతో లోకేష్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మాస్టర్ సినిమాలో హీరో విజయ్ సేతుపతిని విలన్ గా చూపించి అందరి మన్ననలు పొందిన దర్శకుడు లోకేష్ 'విక్రమ్' సినిమాలో లారెన్స్ ను విలన్ గా చూపించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. లారెన్స్ మొదటి సారి పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడు. కనుక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్ హాసన్ మరో నెల రోజుల తర్వాత 'విక్రమ్' షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.