బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతడికి అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆ క్రేజుతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అతడికి ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో తాజా గా ఒరేయ్ బుజ్జిగా కరీంనగర్ ఈవెంట్ ప్రూవ్ చేసింది.
ఓవైపు రాజ్ తరుణ్ హీరో అయినా.. రాహులే హీరో అన్నంతగా ఫీలైన అభిమానులు అతడితో వేదిక వద్ద సెల్ఫీలు దిగేందుకు మీద పడ్డారట. ఇక రాహుల్ పాట పాడేప్పుడు.. స్పీచ్ లిచ్చేప్పుడు ఫ్యాన్స్ కరతాళధ్వనులతో అదరగొట్టేశారు. దీంతో రాజ్ తరుణ్ సైతం నా హీరో ఆయనే అంటూ రాహుల్ ని పొగిడేయాల్సొచ్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ కి విన్నర్ కి అంతటి అసాధారణ ఫాలోయింగ్ ఉంటుందని ఇలాంటప్పుడే తెలిసొచ్చేది.
ఇక రాహుల్ కి తెలంగాణలోనూ అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా గాళ్స్ అంతా అతడంటే పడి చస్తున్నారు అనడానికి అతడితో దిగిన సెల్ఫీలే ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు. అన్నట్టు రాజ్ తరుణ్ సినిమా సంగతేమో కానీ... రాహుల్ నటిస్తున్న సినిమాకి క్రేజు పెరిగేట్టే ఉంది.
మరోవైపు రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా ఈనెల 25న రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా వేయాల్సి వస్తోందని హీరోనే స్వయంగా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా థియేటర్లను మార్చి 31 వరకు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడుతోంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. రాజ్ తరుణ్- మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించారు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.