త్రివిక్రమ్‌ ఆ సెంటిమెంట్‌ వదిలేస్తున్నాడా?

Update: 2020-12-10 12:33 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అత్తారింటికి దారేది సినిమా నుండి మొన్న వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా వరకు 'అ ఆ' సెంటిమెంట్‌ ను ఫాలో అవుతున్నాడు. మద్యలో ఒకే ఒక్క సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా వచ్చింది. అది మినహా 2013 నుండి 2020 వరకు టైటిల్‌ లో అ సెంటిమెంట్‌ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్‌ తో మొదలు పెట్టబోతున్న సినిమాకు కూడా అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ సినిమాకు త్రివిక్రమ్‌ అ సెంటిమెంట్‌ ను బ్రేక్‌ చేస్తాడేమో అంటున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. మార్చిలో ఆ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్దం అయ్యాడు. ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ ల మూవీ మార్చిలో పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం 'రాజా వచ్చినాడు' అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కథానుసారం ఈ టైటిల్‌ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ అనుకుంటున్నాడట. అ సెంటిమెంట్‌ ను ఈసారికి పక్కన పెట్టి కథకు సెట్‌ అయ్యే విధంగా ఈ సినిమాకు రాజా వచ్చినాడు టైటిల్‌ ను పెట్టాలని భావిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా నిరాశ పర్చింది. అందుకే ఈసారి అ సెంటిమెంట్ ను కూడా పక్కకు పెట్టి ఎన్టీఆర్‌ తో సినిమాను చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు అంటున్నారు. వచ్చే ఏడాది చివరి వరకు లేదా 2022 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై పలు వార్తలు షికార్లు చేశాయి. చివరకు ఎవరు ఎంపిక అవుతారు అనేది చూడాలి.
Tags:    

Similar News