RRR ప్రెస్ మీట్ తో చాలా సందేహాలకు.. స్పెక్యులేషన్లకు ఫుల్ స్టాప్ పడింది. హీరోయిన్ల విషయం.. ఇతర కీలక నటుల విషయంపై క్లారిటీ వచేసింది. బడ్జెట్.. రిలీజ్ డేట్ కూడా చెప్పారు. ప్రెస్ మీట్ మొత్తంలో ఒక సర్ ప్రైజ్ ఏంటంటే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అజయ్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు ఆయన అవన్నీ స్పెక్యులేషన్లేనని.. RRR లో నటించడం లేదని కొట్టిపారేశాడు. అలాంటిది ఇప్పుడు ఎలా RRR టీమ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు?
దీనివెనుక పెద్ద తతంగమే నడిచిందనే టాక్ బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. మొదట రాజమౌళి RRR లో కీలకపాత్ర కోసం అజయ్ దేవగణ్ ను సంప్రదించడం నిజమేనట. కానీ పాత్ర నిడివి తక్కువ కావడం.. క్యారక్టరైజేషన్ కూడా కాంప్లెక్స్ గా ఉండడంతో సినిమాలో నటించే విషయంలో అజయ్ నిర్ణయం తీసుకోలేదట. కానీ రాజమౌళి మాత్రం ఆ పాత్ర ఎలాగైనా అజయ్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారట. మరోవైపు అజయ్ తన పాత్రకు సంబంధించిన ఫుల్ నేరేషన్ విన్న తర్వాత ఎగ్జైట్ అయ్యాడట. అంతే కాకుండా అజయ్ అడిగిన రెమ్యూనరేషన్ కు రాజమౌళి టీమ్ ఒకే చెప్పడంతో పాటు పాత్ర నిడివిని కూడా కాస్త పెంచడం జరిగిందని.. అవన్నీ జరిగిన తర్వాతే అజయ్ RRR కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
సినిమా కథ ప్రకారం చరణ్.. ఎన్టీఆర్ ఢిల్లీ ప్రాంతానికి వెళతారని అక్కడ అజయ్ దేవగణ్ పాత్ర వారికి తారసపడుతుందని అంటున్నారు. ఉత్తర భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో అజయ్ కనిపిస్తాడట. బాలీవుడ్ లో ఉన్న పవర్ఫుల్ యాక్టర్లలో అజయ్ ఒకరు. ఆయనకు నార్త్ ఇండియాలో మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ సినిమాకు ఆయన పాత్ర భారీ అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహమే లేదు.