అందరికీ కొత్త కార్డులిచ్చిన రాజమౌళి

Update: 2016-02-17 11:30 GMT
నిజానికి కొన్ని విషయాల్లో రాజమౌళి పాటించే ప్రొఫెషనలిజం చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది. మామూలుగా బాలీవుడ్‌ లో మాత్రమే ఫాలో అవుతున్న కొన్ని పద్దతులను మనోడు ఇక్కడ కూడా ప్రవేశపెట్టాడు.

రాజమౌళి సినిమాల ప్రమోషన్‌ టైములో చూడండి.. తన యాక్టర్లు - తన క్రూ.. అక్కడక్కడా ఆ సినిమాకు సంబంధించిన లోగోతో కూడిన టీ-షర్టులు వగైరా వేసుకొని కనిపిస్తారు. ఇకపోతే సినిమా షూటింగ్‌ టైములోనే సెట్‌ లో పనిచేస్తున్న క్యాస్ట్‌ అండ్‌ క్రూ అందరికీ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేస్తాడు జక్కన్న. ప్రస్తుతం తాను తీస్తున్న బాహుబలి పార్టు 2 కు సంబంధించి.. కొత్త ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేశాడట. ఈ కార్డు లేకుండా ఏ రోజూ ఎవ్వరూ షూటింగ్‌ లో పాల్గొనడానికి కుదరదు. అసలు సినిమాలు ఏముందిలే అనుకునేవారు.. ఈ ప్రొఫెషనల్‌ కార్పొరేట్‌ అప్రోచ్‌ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే మరి.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలోని ఒక సెట్‌ లో కొన్ని ప్యాచ్‌ వర్క్‌ సీన్లు తీస్తున్న జక్కన్న.. త్వరలోనే ఫారిన్‌ లో బాహుబలి 2 తదుపరి షెడ్యూల్‌ ను మొదలుపెడతాడట.
Tags:    

Similar News