రాజ‌మౌళి ఫీల్ అయ్యాడా?!

Update: 2015-12-25 05:45 GMT
కొన్ని స‌న్నివేశాలు ఆయా ద‌ర్శ‌కుల అత్యుత్త‌మ క్రియేటివిటీకి ప్ర‌తిబింబంగా నిలుస్తుంటాయి. వాటిని చూసిన‌ప్పుడు  ప్రేక్ష‌కులు `భ‌లే తీశాడ్రా...`  అని మాట్లాడుకుంటుంటారు. అలాంటి స‌న్నివేశాల‌కి, ద‌ర్శకుల‌కి ప్ర‌తి ఒక్క‌రూ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ మ‌న‌వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసు క‌దా? ఆ స‌న్నివేశాల్ని తీసుకొని స్పూఫ్‌ లు చేసేస్తున్నారు. క‌మెడియ‌న్ల‌ని పెట్టి  ఆ స‌న్నివేశాల్ని సిల్లీగా తీసేస్తున్నారు. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికే ఆ ప్ర‌య‌త్నం  చేస్తున్నామ‌ని ఎవ‌రైనా చెప్పుకోవ‌చ్చు కానీ...  ఆ స‌న్నివేశాల్ని ఒరిజిన‌ల్‌ గా సృష్టించిన ద‌ర్శ‌కులు మాత్రం కొన్నిసార్లు మ‌న‌సు నొచ్చుకొనే ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. అంత క‌ష్ట‌ప‌డి తీసిన స‌న్నివేశాల్ని మ‌రీ ఇలా సిల్లీగా వాడేశారేంటి అని బాధ‌ప‌డుతుంటారు.  ఇటీవ‌ల రాజ‌మౌళి కూడా అదే త‌ర‌హాలో ఆవేద‌న‌కి గుర‌య్యార‌ని స‌మాచారం. సౌఖ్యం సినిమాలో బాహుబ‌లి స‌న్నివేశాల స్పూఫ్‌ లే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

బాహుబ‌లిలో ప్ర‌భాస్ శివ‌లింగాన్ని ఎత్తుకొని జ‌ల‌పాతం ద‌గ్గ‌ర పెట్టే స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో అల‌రించింది. బాహుబ‌లికి హైలెట్‌ గా నిలిచిన స‌న్నివేశాల్లో అదొక‌టని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఆ స‌న్నివేశాన్ని సౌఖ్యం సినిమాలో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీపై స్పూఫ్‌ గా తెర‌కెక్కించారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న రాజ‌మౌళి కాస్త ఫీల్ అయ్యాడ‌ట‌. ``బాహుబ‌లి పార్ట్ 2 కూడా ఉంద‌ని తెలుసు, అందులోనూ ఈ త‌ర‌హా స‌న్నివేశాలుంటే ఉండొచ్చ‌న్న సందేహం ద‌ర్శ‌కుల‌కి రావాలి క‌దా!  ఇలా ఏది ప‌డితే అది వాడేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం?`` అని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోయిన‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News