'బాహుబలి2'పై జక్కన్న ఆలోచనేంటంటే...!

Update: 2015-06-29 04:24 GMT
ఇంకా బాహుబలి ఫస్ట్‌ పార్టే ప్రేక్షకుల ముందుకు రాలేదు. అప్పుడే సెకండ్‌ పార్ట్‌ గురించి ఊహాగానాలు జోరందుకొన్నాయి. బాహుబలి అనుకొన్న రేంజ్‌లో సక్సెస్‌ అయ్యిందంటే రెండో చిత్రాన్ని మరింత భారీగా తీయాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. అందులోకి కొత్త నటీనటుల్ని కూడా తీసుకొచ్చే ప్లానింగ్‌ ఆయనకి ఉందట. అవసరమైతే ఇప్పటికే తీసిన 40శాతం సినిమాని కూడా పక్కనపెట్టి కొత్తగా మళ్లీ 'బాహుబలి2' తెరకెక్కించాలని కూడా రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...

    200కోట్ల వ్యయంతో 'బాహుబలి' తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేసి తొలి పార్ట్‌తోనే ఆ పెట్టుబడినంతా తిరిగి రాబట్టుకోవాలనేది చిత్రబృందం ప్లానింగ్‌. ఆ మేరకు పకడ్బందీగా మార్కెట్‌ని చేస్తున్నారు. బాహుబలికి ఊహించని రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ కావడం, మార్కెటింగ్‌ కూడా భారీస్థాయిలో జరగడంతో చిత్రబృందం ఇప్పుడు బాహుబలి 2పై దృష్టిపెట్టింది. ప్రేక్షకుల నుంచి బాహుబలికి లభించే ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో చూసుకొని అందుకు తగ్గట్టుగా బాహుబలి2ని రూపొందించబోతున్నారట. బాహుబలి 2 కథ రీత్యా రెండో పార్ట్‌లో రెండు కీలకమైన పాత్రలు వస్తాయట. అవి స్టార్‌ కథానాయకులు చేయాల్సిన పాత్రలేనట. ఆ పాత్రల్ని హిందీ నుంచి ఒకరితోనూ, తమిళ్‌ నుంచి మరొకరితోనూ చేయించాలనేది రాజమౌళి ప్లానింగట. దానివల్ల సినిమాకి మార్కెట్‌ని మరింత పెచ్చుకోవచ్చనేది దర్శకనిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.

Tags:    

Similar News