రాజమౌళి ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ వరుసక్రమంలో చూసుకుంటూ వెళ్తే కనివిని ఎరుగని గొప్ప కథ ఎందులోనూ ఉండదు. కేవలం కథనంలోని ఇంద్రజాలంతో ప్రేక్షకులను ఓ కొత్త అనుభూతికి గురి చేయడం ద్వారా హీరోయిజంని ఎలివేట్ చేయడంలో తన నేర్పరితనాన్ని పూర్తిగా వాడుకోవడం ద్వారా మాస్టర్ టెల్లర్ గా నిలిచిపోయాడు. సింహాద్రి- విక్రమార్కుడు- యమదొంగ- ఛత్రపతి లాంటి ఉదాహరణలు తీసుకుంటే అందులో అప్పుడెప్పుడో వచ్చిన ఇతర దర్శకుల చిత్రాల ఛాయలు కనిపిస్తాయి.
కానీ కాసేపటికే ఆడియన్స్ ని వల్లో వేసుకుని మెప్పిస్తాడు కాబట్టే తెలుగు సినిమా పరిధిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలి నుంచి తన ఆలోచన స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ గురించిన ప్లాట్ అందరి మతులు పోగొట్టేసింది
అల్లూరి సీతారామరాజు కొమరం భీంల పేర్లు చరిత్రలు కొంత మేరకు అవగాహన ఉన్నా ఇప్పటి తరానికి వీళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువ. పైగా ఈ వ్యక్తుల చరిత్రల మీద ఎక్కువ సినిమాలు రాలేకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే రాజమౌళికి విడివిడిగా కాకుండా ఆవేశానికి విప్లవానికి మారుపేరుగా నిలిచిన ఈ ఇద్దరిని ఒకేసారి తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాన్నతో చెప్పగానే అది కాస్తా ఆర్ ఆర్ ఆర్ గా రూపం దాల్చింది.
మొన్నటి దాకా ఏదో 1920 బ్యాక్ డ్రాప్ అనే లీక్ తప్ప ఇలా అల్లూరి కొమరం కాంబోలో కథను రాజమౌళి చెబుతాడని కనీసం ఎవరి ఊహకు సైతం అందలేదు. అందుకే మీడియా సైతం వినగానే షాకింగ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. వర్తమానం లేకుండా కేవలం చారిత్రాత్మక గతాన్ని ఊహలను జోడించి తీయడం అంటే మాటలా. అందుకే ఆయన్ను ఊరికే జక్కన్న అనలేదు.