ఆర్ ఆర్ ఆర్ హాట్ న్యూస్ : కార్లు బ్లాక్

Update: 2019-03-22 06:38 GMT
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తన మన హీరో భేదాలు లేకుండా యావత్ ప్రేక్షక లోకం ఎదురు చూస్తోంది . ఎటూ రిలీజ్ డేట్ ప్రకటించేసారు కాబట్టి ఇంకో ఏడాదిన్నర వేచి చూడక తప్పదు. ఆలోపు వచ్చే అప్ డేట్స్ అభిమానుల్లో అంతకంతా ఉత్సుకత పెంచుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి అప్పటి కాలంలో వాడినట్టుగా చెప్పబడే కొన్ని ప్రత్యేకమైన వింటేజ్ కార్లను భారీ మొత్తాన్ని అద్దెగా చెల్లించి ఏడాది కాలాన్నికి తెచ్చుకున్నారట. ఇవి అందరి దగ్గర దొరకవు. బెంగుళూరులో డాక్టర్ రవి ప్రకాష్ అనే ఆయన వీటికి సుప్రసిద్ధి. ప్రపంచంలో ఎవరి దగ్గరా దొరకని సుమారు 150కి పైగా కార్లు ఈయన రేర్ కలెక్షన్ లో ఉన్నాయి

జవహర్ లాల్ నెహ్రూ వాడిన 1928 నాటి లాంచెస్టర్ ఎస్టి8 మోడల్ తో పాటు జాగ్వార్ క్లాసిక్ రేంజ్ లాంటివి ఎన్నో ఆయన వద్ద ఉన్నాయి. క్లాసిక్ ఛేజ్ పేరుతో నిర్వహించే ఈ సంస్థను ఆయనతో పాటు కూతురు రుపాలి చూసుకుంటారు . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభానికి ముందే అక్కడికి వెళ్ళి 1920లో వాడిన కార్లను చూసుకుని ఏడాది రెంటల్ కు మాట్లాడుకుని వచ్చారట.

సాధారణంగా వీటిని ఒక రోజు లేదా రెండు వారాలు అలా అద్దెకు ఇస్తూ ఉంటారు. కాని రాజమౌళి మల్టీ స్టారర్ కాబట్టి అలాంటి కండిషన్ వర్క్ అవుట్ కాదు. ఇది అధికారికంగా బయటికి రాలేదు కాని ఈ కార్ల కోసం అద్దె రూపంలో రవిప్రకాష్ కు భారీ మొత్తాన్ని చెల్లించబోతున్నట్టు టాక్. ఏమైనా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ప్రతి విషయం సెన్సేషన్ కు తక్కువ స్థాయిలో లేదు
    

Tags:    

Similar News