ఈ ఏడాది ఏప్రిల్ లో కాలా రిలీజ్ డేట్ విషయం లో ఏర్పడ్డ గందరగోళం వల్ల భరత్ అనే నేను-నా పేరు సూర్య విడుదల తేదీల గురించి కొంత సందిగ్దత ఏర్పడ్డ సంగతి అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది. అయితే ఒక అండర్ స్టాండింగ్ తో మహేష్ బన్నీ సినిమాల నిర్మాతలు తేదీలను ఫిక్స్ చేసుకోవడంతో కాలా చెప్పిన డేట్ ను వదిలేసారు. అయితే అంతా చేసి ఏవో కారణాలు చెప్పి కాలా ను వాయిదా వేసుకున్నారు. దాని వల్ల ఇక్కడే కాదు తమిళ్ కన్నడ సినిమాల విడుదల కూడా ఇబ్బందిలో పడ్డాయి.
ఇప్పుడు పెట్టా కూడా అదే తీరులో ఉండేలా ఉంది. తమిళ్ వెర్షన్ జనవరి 10నే ఫిక్స్ చేసుకున్నప్పటికీ తెలుగు కు సంబంధించి మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎన్టీఆర్-వినయ విధేయ రామ-ఎఫ్2 లతో ఇప్పటికే పోటీ వేడెక్కగా మూడింటికి కావాల్సినన్ని థియేటర్లు సర్దలేక బయ్యర్లు కిందామీదా పడుతున్నారు. ఈ నేపథ్యం లో రేస్ లో పెట్టా రావడం జరగని పని. అయితే దీనికి ప్రత్యాన్మాయంగా జనవరి 25న పెట్టాను తెలుగు లో విడుదల చేయడం గురించి సన్ సంస్థ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ డేట్ ను అఖిల్ మిస్టర్ మజ్ను కోసం లాక్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ 118 అదే రోజు వచ్చే అవకాశం ఉంది. మల్టీ లాంగ్వేజ్ మూవీ మణికర్ణిక వచ్చేది కూడా 25నే.
ఇప్పుడు వీటి మధ్య పెట్టా వచ్చిందంటే ముందు చెప్పిన సమస్యే పునరావృత్తమవుతుంది. పోనీ అదైనా ఖరాఖండిగా చెబుతున్నారా అంటే అదీ లేదు. నాన్చీ నాన్చీ ఎప్పుడు తెలుస్తారో చెప్పలేని పరిస్థితి. సో కాలా తరహాలోనే పెట్టా కూడా తెలుగు సినిమాల విడుదల విషయంలో చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ టీజర్-ఆడియో విడుదలైపోయాయి కానీ ఇక్కడ మాత్రం వాటి ఊసే లేదు.