ర‌కుల్ ఆశ‌లపై మ‌ళ్లీ దెబ్బ ప‌డింది..!

Update: 2021-05-27 07:35 GMT
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్‌ ప్రీత్ సింగ్ కు టైం అసలు కలిసి రావడం లేదు. 'మన్మథుడు 2' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన 'చెక్' ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో హవా తగ్గిపోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు హిందీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రకుల్ నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ''సర్దార్ కా గ్రాండ్ సన్'' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంతో నీనా గుప్తా - జాన్ అబ్రహాం - అదితి రావు హైదరీ కీలక పాత్రలు పోషించారు. కాష్వీ నాయర్ దర్శకత్వంలో 'సర్దార్ కా గ్రాండ్ సన్' రూపొందింది. దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీలో అనుకున్నంత స్థాయిలో వ్యూయర్ షిప్ ద‌క్కించుకోలేద‌ని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. చూసిన వాళ్ళు కూడా హీరోహీరోయిన్ల కంటే నీనా గుప్తా కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు.

దీంతో బాలీవుడ్ లో ఎలాగోలా నిల‌బ‌డాలని గట్టిగా ట్రై చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ కి మళ్లీ నిరాశే ఎదురైందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే రకుల్ నిరూపించుకోడానికి హిందీలో మరో రెండు అవకాశాలు ఉన్నాయి. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ వంటి స్టార్స్ తో కలిసి 'మే డే' సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు అమ్మడిని బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలబెడతాయేమో చూడాలి.
Tags:    

Similar News