హైద్రాబాద్ లో హోటల్ ఖాళీ చేసేసింది

Update: 2016-03-05 08:23 GMT
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి.. హైద్రాబాద్ లో ఉన్నపుడల్లా ఒకే హోటల్ లో ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. హైటెక్ సిటీకి దగ్గర్లో ఉండే స్టార్ హోటలే అమ్మడి నివాసం. ఇప్పుడా హోటల్ ఖాళీ చేసేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇందుకు కారణం.. ఈ భామ సొంతిల్లు కొనేసుకోవడమే. ఈ పంజాబీ బ్యూటీ హైద్రాబాద్ కు పర్మనెంట్ గా మకాం మార్చేస్తోంది.

ఇక ఇక్కడే ఉండిపోవాలని డిసైడైపోయిందట. అందుకే రీసెంట్ గా ఓ పోష్ బంగ్లాను కూడా కొనేసింది. జూబ్లీ హిల్స్ ఉండే ఈ పోష్ బంగ్లా ఖరీదు ఏకంగా మూడు కోట్లు. జూబ్లీ హిల్స్ లో లోటస్ పాండ్ సమీపంలో ఉండే ఈ త్రీ బెడ్ రూమ్ హౌస్.. 16వేల చదరపు అడుగులతో విశాలంగా ఉంుటంది. షూటింగుల కోసమే కాదు.. హైద్రాబాద్ లోనే సెటిల్ అయిపోవాలన్నది రకుల్ ప్రీత్ సింగ్ ఆలోచన. ఈమెతో పాటు అమ్మ - సోదరుడు కూడా హైద్రాబాద్ వచ్చేయనున్నారట.

అందుకే ఇంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు సినిమాలే కాకుండా.. మరోవైపు వ్యాపారాలను హైద్రాబాద్ బేస్ గానే నడపాలన్నది రకుల్ ఆలోచన. రీసెంట్ గా ఈమె స్టార్ట్ చేసిన ఎఫ్45 జిమ్ కూడా... రకుల్ సొంతమే అన్న విషయం తెలిసిందే. ఈ బిజినెస్ ను బ్రదర్ కి అప్పగించనుంది రకుల్ ప్రీత్ సింగ్.
Tags:    

Similar News