స్పైడర్ కోసం రెండేసి డ్యాన్సులేసింది

Update: 2017-09-17 11:36 GMT
ఎంత పెద్ద సినిమా స్టార్స్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక సినిమాకు చాలా కష్టపడే టైమ్ వస్తుంది. అలాంటి సినిమా వచ్చినప్పుడు స్టార్స్  అసలు టాలెంట్ ని చూపించడానికి చాలా కష్టపడతారు. ఇంతకుముందు తమిళ్ లో చాలా మంది ఎక్కువగా ప్రయోగాలు చేసేవారు. ఇప్పుడు అదే తరహాలో తెలుగులో కూడా ప్రయోగాలు ఎక్కువగా మొదలవుతున్నాయి. ఎందుకంటే స్పైడర్ సినిమా కోసం మహేష్ - రకుల్ చాలా కష్టపడ్డారు.

మహేష్ తమిళ్ లో డైరెక్ట్ ఫిల్మ్ తియ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకోసం మురగదాస్ లాంటి మంచి దర్శకుడిని ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కుతుండడంతో మహేష్ తో పాటు రకుల్ కూడా రెండు భాషల్లో సినిమా షూటింగ్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిందట. తెలుగు కాస్త బాగానే నేర్చుకున్నా తమిళ్ నేర్చుకోవడానికి మాత్రం అమ్మడు చాలా ఏకాగ్రత వహించిందట. ఒక్కోసారి సీన్స్ తగ్గట్టు సరిగ్గా రాకపోతే మురగదాస్ మళ్లీ మళ్లీ చేయించాడట. దీంతో రకుల్ స్పైడర్ బేజా ఫ్రై అనుభవం లాంటిది అంటోంది.

ఇక డ్యాన్సులు కూడా తెలుగు -తమిళ్ లిరిక్స్ కి తగ్గట్టు లిప్ రీడింగ్ ఇచ్చేందుకు రకుల్ మహేష్ చాలా కష్టపడ్డారట. ఎప్పుడు ఏ సినిమాకు ఇంతలా కష్టపడలేదు అని మహేష్ అంటే.. రకుల్ మాత్రం పూసలు కదిలిపోయాయి అంటోంది. రెండు చోట్లా పాటలకు వేర్వేరు స్టెప్పులు ఉండటంతో.. రేండేసి డ్యాన్సులు వేశాను అంటోంది మన హాటీ. మొత్తానికి స్పైడర్ ని ఇరుబాషల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసేశారట. ఇక విడుదలయ్యాక సినిమా చూస్తే తెలుస్తుంది వీరి కష్టం ఏమిటో..
Tags:    

Similar News