రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి నిరంతరం ఎంతో ఫోకస్ట్ డ్ గా పనిచేస్తుంది. శ్రమకు తగ్గ అవకాశాలైతే వస్తున్నాయి గానీ...ఫలితాలు మాత్రం రావడం లేదు. అయినా రకుల్ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సినిమాలు చేస్తూనే ఉంది. తన వంతుగా శక్తివంచన లేకుండా శ్రమిస్తుంది.
కష్టే ఫలి అన్న సిద్దాంతాన్ని నమ్ముకుని ముందుకెళ్తుంది. తాజాగా ఓ సినిమా కోసం ఏకంగా 11 గంటల పాటు నీటిలోనే ఉండిపోయిందిట. అదీ రాత్రి సమయంలో! అందులోనూ ఒణికించే చలిలోనే ఉండిపోయిందిట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు రివీల్ చేసి షాకిచ్చింది. కానీ ఏ ఏసినిమా కోసం ఇంతగా శ్రమిస్తోంది? ఆ సినిమా వివరాలు మాత్రం రివీల్ చేయలేదు.
కేవలం ఆ సినిమా కోసం తాను ఎంతగా కష్టపడుతుంది! అన్న విషయాన్ని మాత్రమే చెప్పుకొచ్చింది. అలాగే తన ఈ కష్టానికి తగ్గ ఫలితం కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. కష్టాన్ని నమ్ముకున్న దాన్ని...నన్ను ఆ శ్రమే పైకి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక రకుల్ జిమ్ములో ఎంతగా శ్రమిస్తుందో? చెప్పాల్సిన పనిలేదు.
హెవీ వెయిట్స్ ఎత్తుతూ ..శ్వేదం చిందిస్తూ తన లో కాన్పిడెన్స్ లెవల్స్ ని మరింత స్ర్టాంగ్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు యోగా ధ్యానాసనాలు లాంటివి చేస్తుంది. రకుల్ సౌత్ కెరీర్ సంగతి చూస్తే అమ్మడు శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై చాలా ఆశలే పెట్టుకుంది.
ఒక్క గాన ఒక్క పాన్ ఇండియా సినిమా ఛాన్స్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని టాప్ లీగ్ లో చేరాలని చూస్తుంది. అలాగే బాలీవుడ్ లో చేతిలో ఛాన్సులైతే ఉన్నాయి గానీ..స్టార్స్ తో మాత్రం చాలా తక్కువ సినిమాలే. సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ లాంటి సీనియర్ స్టార్లతో రొమాన్స్ చేయాలన్నది బ్యూటీ డ్రీమ్. మరి అదెప్పుడు నెరవేరుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.