కొణిదెల వారసుడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ బర్త్ డే మార్చ్ 27. మరి చిరంజీవి కొడుకుగా.. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా వెలిగిపోతున్న చెర్రీ.. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం పెద్ద విశేషమేం కాదు. కానీ ఈ సారి మాత్రం తన బర్త్ డేని అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోనున్నాడు ఈ హీరో.
మెగాభిమానులను గిన్నిస్ బుక్ లోకి చేర్చేలా ప్లాన్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. పలు దేశాల్లో దాదాపు 250 వరకూ రక్తదాన శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో దానిలో వెయ్యి మంది ను రక్తం సేకరించేలా ప్రణాళికలు రూపొందించారు. లక్షల కొద్దీ యూనిట్ల రక్తాన్ని సేకరించి, అదో ప్రపంచ రికార్డ్ చేయాలన్నది వీరి ఆలోచన. అంతా బాగనే ఉంది కానీ.. ఇప్పుడు దీనికోసం కేంపెయినింగ్ కూడా మొదలైపోయింది.
వరుణ్ తేజ్ - సాయిధరం తేజ్ లు కూడా స్పెషల్ గా బైట్స్ ఇచ్చి.. ఇదే విషయంపై ఊదరగొట్టేస్తున్నారు. అంతంతసేపు మాట్లాడి కూడా రక్తాన్ని దానం చేస్తే ఉపయోగమేంటో ఒక్కరి నోటి వెంట కూడా రావడం లేదు. అదేదో మెగా ఫంక్షన్ అన్నట్లుగా ఉంది వీళ్ల హడావిడి. రక్తదానంపై అవగాహన పెంచేలా.. చేస్తున్న పని మంచిదే అయినా.. దాన్ని సరైన పద్ధతిలో ప్రచారం చేయకపోతే., రాంగ్ సిగ్నల్స్ అందుతాయ్. లక్షల మందితో కలిసి డీల్ చేసే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు చాలానే తీసుకోవాలి.