బెస్ట్ అంకుల్ గా మారిన చెర్రీ!

Update: 2018-07-23 04:44 GMT
స్టార్ కిడ్స్ అంటే మాటలు కాదు.  రెడీమేడ్ అభిమానులను పుట్టుకతోనే సంపాదించుకున్న అదృష్టవంతులు.  ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రుల మీద - తాతల మీద ఉండే ప్రేమను.. స్టార్ కిడ్స్ మీద కురిపిస్తారు.  ఇప్పటి జెనరేషన్ లో సోషల్ మీడియా చాలా పాపులర్ కాబట్టి స్టార్ కిడ్స్ ఫోటోలు - వాళ్ళకు సంబంధించిన విశేషాలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. దీంతో వాళ్ళు చిన్నవయసులోనే మరింతగా పాపులర్ అవుతున్నారు..  ఈ లిస్టు లో మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఉంటారని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు కదా..

ఈమధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ తన పుట్టినరోజును జరుపుకున్నాడు.  అసలే నందమూరి ఫ్యామిలీ.. అందులోని ఎన్టీఆర్ స్టార్ డం పీక్స్ లో ఉంటుంది.. మరి అభయ్ రామ్ పుట్టిన రోజునాడు బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా దుమ్ములేపారు అభిమానులు.   అంతేనా..? ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో గట్టి పోటీదారులు అయిన స్టార్ హీరోలు కూడా బుల్లి అభయ్ కి శుభాకాంక్షలు చెప్పడం మరో విశేషం.   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎన్టీఆర్ లిద్దరూ రియల్ లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వారిద్దరూ రాజమౌళి మల్టిస్టారర్ లో కలిసి నటించబోతున్నారు కూడా. దీంతో చరణ్ ఒక వీడియో ద్వారా అభయ్ కి శుభాకాంక్షలు తెలిపాడు.

అభయ్ కి శుభాంక్షలు తెలపడమే కాకుండా తనకోసం ఒక మంచి గిఫ్ట్ ను పంపానని, నాన్ననడిగి తీసుకోమని చెప్పాడు. ఆ బహుమతి నచ్చుతుందని అనుకుంటున్నానని - బర్త్ డే ఎంజాయ్ చెయ్యమని చెప్పాడు.  అభయ్ కే కాదు, ఈమధ్యనే పుట్టిన రోజు జరుపుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు కూడా చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.   చరణ్-మహేష్ -ఎన్టీఆర్ ల ఫ్రెండ్షిప్.. వారి ఫ్యామిలీల మధ్య అనుబంధం అభిమానులకు చాలా ఆనందాన్నిస్తున్నాయి.  ఎప్పుడు సమయం దొరికినా అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. వృత్తి పరంగా పోటీ పడినా వ్యక్తిగతంగా మంచి స్నేహితులుగా ఉండడం టాలీవుడ్ లో ఒక మంచి పరిణామం.. అభిమానులకు కూడా ఇది మంచి సందేశాన్ని ఇచ్చినట్టే.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News