రామ్ చరణ్ కు శర్వానంద్ చిన్న నాటి స్నేహితుడన్న సంగతి చాలామందికి తెలియదు. ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఏమీ రాసుకు పూసుకు తిరిగేయరు కానీ.. ఇద్దరి మధ్య మంచి అనుబంధముంది. అది అరుదుగా బయటికి వస్తుంటుంది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విడుదల నేపథ్యంలో దాని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి.. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి శర్వాతో చెర్రీకి ఉన్న ఫ్రెండ్షిప్పే కారణం. ఈ సినిమా విషయంలో తనకు వ్యక్తిగతంగానూ చెర్రీ కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు చెప్పాడు శర్వా. ‘‘చరణ్ బెంగళూరులో ఉండటం వల్ల ఇంకా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమా చూడలేదు. ఐతే విడుదలకు ముందు పాటలు మాత్రం చూపించాం. ఓ పాటలో నా డ్యాన్స్ చూసి.. ‘ఏంట్రా ఈ రేంజిలో డ్యాన్స్ చేశావ్’ అంటూ ఆశ్చర్యపోయాడు చరణ్. ఇక్కడికి వచ్చాక కచ్చితంగా సినిమా చూస్తానని చెర్రీ చెప్పాడు’’ అని శర్వా అన్నాడు.
ఎప్పటికైనా తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని అనుకునేవాడినని.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో అది నెరవేరినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని శర్వా చెప్పాడు. ‘‘యువి క్రియేషన్స్ లో సినిమా చేయడం వల్లే నా కోరిక నెరవేరింది. వంశీ, ప్రమోద్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ‘మనం సంక్రాంతికి వస్తున్నాం’ అంటూనే ఉన్నారు. చివరికి అన్నట్లే ఇంత పోటీలోనూ సినిమా రిలీజ్ చేశారు. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ కూడా సినిమా చూసి చాలా బావుందన్నాడు’’ అని శర్వా చెప్పాడు. ‘శర్వా సినిమాలో కంటెంట్ ఉంటుంది’ అని నమ్మి, థియేటర్‌కి వచ్చేవాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలనుకోవడమే తన లక్ష్యమని.. ఆ ఉద్దేశంతోనే సినిమాలు చేస్తానని శర్వా అన్నాడు.