అభిమాని కి అవార్డు అంకితమిచ్చిన చెర్రీ

Update: 2019-12-11 13:40 GMT
అభిమానుల్ని గుండెల్లో పెట్టుకునే వాడే సిస‌లైన హీరో. ఈ విష‌యాన్ని ప్రాక్టిక‌ల్ గా మ‌రోసారి నిరూపించారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. త‌న అభిమాని క‌ష్టం చూసి చ‌లించి ల‌క్ష‌ల్లో వైద్యానికి సాయం చేసి చివ‌రికి మ‌ర‌ణించిన‌ప్పుడు క‌ల‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు తాను ఎక్క‌డో దూరాన షూటింగులో ఉండీ.. అభిమాని మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకున్న చ‌ర‌ణ్ వెంట‌నే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. ఇటీవలే రంగ‌స్థ‌లం చిత్రానికి రామ్ చ‌ర‌ణ్  బిహైండ్ వుడ్ గోల్డ్  మెడ‌ల్ అవార్డును చెన్నై లో అందుకున్నారు. చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌ తో క‌లిసి ఈ అవార్డు కు హాజ‌ర‌య్యారు. అయితే ఈ అవార్డు ను రెండు రోజుల క్రితం గుండె పోటు తో మృతి చెందిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు నూర్ అహ్మ‌ద్ భాయ్ కి అంకితమిచ్చారు రామ్ చ‌ర‌ణ్‌. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ అభిమానుల గ‌ప్ప‌త‌నం గురించి మాట్లాడిన తీరు మైమ‌రిపించింది. మ‌న‌మంతా అభిమానుల వ‌ల్లే ఎంతో సంతోష‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నామ‌ని..  నాన్న‌ని.. న‌న్ను 12 ఏళ్ల‌గా ప్రోత్స‌హించార‌ని నూర్ అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.

నూర్ మృతి చెందిన సమయంలో రామ్ చరణ్ చెన్నైలోనే ఉన్నారు. అందుకే ఫేస్‌బుక్ ద్వారా సంతాపం తెలియజేశారు. అత‌డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయ‌డ‌మే గాక‌.. రూ 10 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించాడు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కుటుంబాన్ని కలుస్తానని చ‌ర‌ణ్ అన్నారు.
Tags:    

Similar News