#RRR: రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు

Update: 2018-03-22 13:07 GMT
అనుకున్నదంతా అయింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. బాహుబలి2 తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమా ఏంటి అనే ప్రశ్న చాలాకాలంగా ఆడియన్స్ ను వెంటాడుతూనే ఉంది. మూడు నెలల క్రితం రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి ఓ ఫోటో దిగి.. తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసినప్పటి నుంచి బోలెడన్ని ఊహాగానాలు బయల్దేరాయి. ఇప్పుడు అవన్నీ నిజమే అనే సంగతి అధికారికంగా తేలిపోయింది.

#RRR అంటూ రాజమౌళి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య అఫీషియల్ గా ప్రకటించేశారు. కేవలం ఆర్.ఆర్.ఆర్ అనే అక్షరాలను మాత్రమే రాసి.. వాటికి అర్ధం రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు అని చెబుతు #RRR అనే హ్యాష్ ట్యాగ్ ను ఓ వీడియో మాదిరిగా రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో.. ఇప్పుడీ అరుదైన కాంబినేషన్ సాకారం కానుందనే సంగతి అధికారికం అయింది.

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ లు వస్తున్నాయి కానీ.. టాప్ రేంజ్ లో ఉన్న ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం మాత్రం ఇప్పటివరకూ జరగలేదు. తెలుగులో ఇలాంటి కాంబినేషన్ కలే అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగల రాజమౌళి.. అరుదైన కాంబినేషన్ ను సాకారం చేసేసి.. సినిమా గురించిన ప్రకటన ఇచ్చేశాడు. అరుదైన మెగా నందమూరి మల్టీస్టారర్ కు బీజం వేసేశాడు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. నందమూరి ఫ్యాన్స్.. కలిసి ఆన్ లైన్ లో చేసే హంగామా తారాస్థాయికి చేరిపోతోంది.


వీడియో చూడటానికి క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News