తెలుగులో వచ్చే ఏడాది రాబోయే సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘రంగస్థలం’ ఒకటి. సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తొలిసారి జత కట్టడం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషం ఆసక్తి రేకెత్తిస్తుండటంతో దీని కోసం ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన కొన్ని విశేషాల్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పంచుకున్నాడు. అతనేమన్నాడంటే..
‘‘రంగస్థలం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమాల్లో ఒకటి. సుకుమార్ కథ చెప్పిన విధానం.. ఆ కథను తెరకెక్కిస్తున్న విధానం నాకెంతో నచ్చింది. నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు సుకుమార్. నాకు మాత్రమే కాదు.. సమంతకి.. ఇతర నటీనటులకు కూడా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఈ కథ విన్నాక షూటింగులో మేం కుదురుకోవడానికి కనీసం ఒక షెడ్యూల్ సమయం అయినా పడుతుందని అనుకున్నాం. కానీ సుక్కు తొలి షాట్ నుంచే నన్ను ఈ ప్రపంచంలో లీనం చేసేశారు. ఆయన వచ్చిన నేపథ్యంలోనే సినిమా సాగడం అందుకు కారణం కావచ్చు. ఈ సినిమా కోసం కాస్ట్యూమ్స్ చాలా వరకు రాజమండ్రిలో కొన్నాం. నేటివిటీ కోసమే సుకుమార్.. మా అక్క కలిసి అక్కడే బట్టులు కొన్నారు. సుకుమార్ నాకు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ ఇచ్చారు. అది ఎందుకు అనుకున్నారో కానీ.. పాత్రకు పర్ఫెక్టుగా సెట్ అయిపోయింది. ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని నాన్న చూశారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు’’ అని చరణ్ తెలిపాడు.