ఈ రోజుల్లో స్టార్ హీరోస్ ఎంత స్పీడ్ గా సినిమా షూటింగ్ ని చేద్దామని అనుకున్నా మినిమం ఏడాది పడుతోంది. ఒక్కోసారి అంతేకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కానీ లెట్ గా వచ్చినా హిట్టు కొట్టాలని హీరోలు తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నాడు. రంగస్ధలం 1985 సినిమా కోసం తన ఇమేజ్ ని కూడా పక్కనపెట్టి చెర్రీ ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదలై చాలా కాలమే అవుతోంది. అయితే ప్రస్తుతం సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. సినిమాలో రాజకీయ పరమైన సన్నివేశాలు చాలా ఉండనున్నాయని తెలుస్తోంది. రంగస్థలం అనే ఊరిలో పాలిటిక్స్ ని కూడా నడిపిస్తాడట చెర్రీ. సుకుమార్ తన గత చిత్రాలకు బిన్నంగా ఈ సినిమా ఉండనుందట. కాకపోతే పల్లెటూల్ళో ఉండే పంచాయితీ పాలిటిక్స్ అన్నీ మెండుగా ఉన్నాయట. అసలు వాటి చుట్టూతానే కథని అల్లినట్లు టాక్. అయితే ఒక్క విషయంలో మాత్రం అయన స్టైల్ ని అస్సలు మార్చలేదట.
సుకుమార్ ప్రతి సినిమాలో లవ్ సీన్స్ చాలా వెరైటీ గా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో సుకుమార్ సమంత - చెర్రీ మధ్యన లవ్ సీన్స్ ని చాలా వినూత్నంగా హార్ట్ కి టచ్ అయ్యే విధంగా తెరకెక్కిస్తున్నాడట. ఇక సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ లో పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఆ తర్వాత మెల్లగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకొని ఫిబ్రవరి చివర్లో లేదంటే మార్చ్ మొదట్లో సినిమాను విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.