చెర్రీ కూడా సంక్రాంతికే ఫిక్స్

Update: 2017-09-16 11:24 GMT
ఈ సారి సంక్రాంతి పండుగ సినిమా రంగానికి బాగా టఫ్ గా ఉండేట్లుగా ఉంది. ఈ పండుగ నాటికి క్యూ కట్టేసిన సినిమాల కౌంట్ పెరుగుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందనున్న చిత్రాన్ని పొంగల్ కి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ ల మూవీ జనవరి 10న రిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

మహేష్ -కొరటాల మూవీ భరత్ అను నేను కూడా సంక్రాంతికే అన్నారు కానీ.. స్పైడర్ షూటింగ్ ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే.. ఇదే పండుగను టార్గెట్ చేసిన సినిమా మరొకటి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985ను కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు చెప్పేశారు. నిజానికి పవన్ సినిమా ఉండడంతో.. మెగా పవర్ స్టార్ మూవీ వాయిదా పడుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఏకంగా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే.. ఇవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమేనని.. రంగస్థలం 1985ను ప్రీపోన్ కానీ.. పోస్ట్ పోన్ కానీ చేయడం లేదని.. పొంగల్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరతామని నిర్మాతలు చెప్పేశారు. అలాగే పీరియాడిక్ మూవీ అయినంత మాత్రాన.. ఇదేమీ ప్రయోగాత్మక చిత్రం కాదని.. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టెయినర్ గానే ఉంటుందని తెలిపారు మేకర్స్.
Tags:    

Similar News