రంగస్థలం ఆ రోజు రాదా?

Update: 2017-12-07 06:04 GMT
ఈ ఏడాది దసరాకే వస్తుందన్నారు ‘రంగస్థలం’ సినిమా. కానీ హడావుడి ఎందుకని సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ సంక్రాంతికి సడెన్‌ గా ‘అజ్నాతవాసి’ వచ్చి పడటంతో దీని రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. చివరికి మార్చి 29కి ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ డేట్ మీద కూడా సందేహాలు కలుగుతున్నాయి. నిన్న రిలీజైన ‘మహానటి’ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ చూశాక ఈ సందేహాలు మొదలయ్యాయి జనాల్లో. ఎందుకంటే ‘మహానటి’ సినిమా మార్చి 29నే రాబోతున్నట్లు ప్రకటించారు. ‘రంగస్థలం’ ఆ తేదీకి పక్కాగా వచ్చేట్లయితే ‘మహానటి’ని ఆ రోజుకు షెడ్యూల్ చేసేవాళ్లు కాదు. ‘రంగస్థలం’ గురించి తెలియకుండా ‘మహానటి’ టీం ఇలా డేట్ ప్రకటించి ఉంటుందని ఎవ్వరూ అనుకోవట్లేదు.

మార్చి 29 నుంచి ప్రిపోన్ చేసేందుకు అవకాశం లేదు కాబట్టి.. సినిమా వాయిదా పడుతోందనే భావించాలి. మరి ఏప్రిల్లో ‘2.0’.. ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ సినిమాల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఇక ‘రంగస్థలం’కు ఎక్కడ డేట్ దొరుకుతుందో చూడాలి. ఐతే మార్చి నెలాఖరుకు పరీక్షల హడావుడి ఇంకా తగ్గి ఉండదని.. అందుకే మిగతా ఏప్రిల్ సినిమాల సంగతి కూడా చూసుకుని వారం రెండు వారాలు లేటుగా ‘రంగస్థలం’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ త్వరలోనే ప్రకటన చేస్తారని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News