కరోనా మహమ్మారి సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వడలదం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందనే వార్తలు వస్తున్నప్పటికీ వైరస్ రూపు మార్చుకొని కొత్తగా వస్తుందనే వార్తలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో కూడా ప్రతి రోజు కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా మరికొంత మంది మృతి చెందారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
రామ్ చరణ్ పోస్ట్ పెడుతూ.. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని.. తనకి ఎటువంటి లక్షణాలు లేవని.. స్ట్రాంగ్ గా తిరిగి బయటకు వస్తానని తెలిపారు. అలానే గత రెండు రోజుల్లో తనకు కలిసిన వారందరిని టెస్ట్ చేయిచుకోవాల్సిందిగా చరణ్ కోరారు. అయితే చరణ్ ఇటీవలే తన ఇంట్లో క్రిష్మస్ వేడుకల్ని నిర్వహించారు. దీనికి అల్లు అర్జున్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ - నిహారిక సహా మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇప్పుడు వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, మెగా ఫ్యామిలీలో ఇంతకముందు నాగబాబు కరోనా బారిన పడి బయటపడ్డారు. అలానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నెగిటివ్ వచ్చింది. కిట్ లోపం కారణంగానే అలా జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.