ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ తో మెగా ఫ్యామిలీ, బంధువులు రెండు రోజుల క్రితమే బెంగళూరు వెళ్లిపోయారు. అదే కారణంతో మార్చ్ 27న జరిగిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు మెగా హీరోలు. ఇదే విషయాన్ని బన్నీ కూడా ఓ అభిమాని ఇంటికి స్వయంగా వెళ్లి మరీ చెప్పాడు.
వీటన్నిటితో పాటు ఈ మార్చ్ 28ని బన్నీకి స్పెషల్ డే అనాలి. ఎందుకంటే.. 13 ఏళ్ల క్రితం ఇదే రోజున అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి మూవీ రిలీజ్ అయింది. దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అల్లు అర్జున్, అదితి అగర్వాల్ జంటగా నటించిన 'గంగోత్రి' మార్చ్ 28, 2003న విడుదలైంది.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్చు చేసిన అల్లు అర్జున్.. తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పాడు. 'సినిమా ఇండస్ట్రీలో ఇది నాకు 13వ సంవత్సరం. ప్రస్తుతం నేను ఉన్న ఈ స్థాయికి చేరుకోవడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'అని చెప్పాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించి సరైనోడు మూవీ.. తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు దర్శకుడు బోయపాటి శీను.