ఈ నెల 26న కొందరిని కలవడానికి విజయవాడ వస్తున్నానంటూ.. రాంగోపాల్ వర్మ ఏ ఉద్దేశ్యంతో ట్వీట్ చేశాడో చెప్పలేం కానీ.. ఇప్పుడు వర్మకు వార్నింగులు ఎక్కువయిపోయాయి. కానీ ఇలాంటి వాటికి బెదిరిపోయే టైప్ కాదు వర్మ. కౌంటర్ వార్నింగ్ అంటూ.. తన స్టైల్ లో రెచ్చిపోయాడు. తను బెజవాడ వచ్చే ఫ్లైట్ డీటైల్స్ - టైం - ఉండబోయే హోటల్ తో సహా.. వివరాలన్నిటినీ నెట్ లో పెట్టి, తనను బెదిరిస్తున్న వాళ్లకి సవాల్ విసిరాడు వర్మ.
'నాకు వార్నింగ్ ఇస్తున్న ఇవాల్టి విజయవాడ రౌడీలు తెలుసుకోవాల్సింది.. నేను ఆనాటి రౌడీలతో తిరిగిన అసలు సిసలైన నిజమైన రౌడీని' అని కూడా రాసేశాడీ డైరెక్టర్. తనకు వార్నింగ్ ఇస్తూ రౌడీలు అనుకుంటున్న ఆకు రౌడీలందరూ బావిలో కప్పలని.. విజయవాడని ఆ రౌడీలం అనుకుంటున్న రౌడీల కంటే ఎక్కువ గౌరవిస్తానంటూ తన ఉద్దేశ్యం తేల్చి చెప్పేశాడు వర్మ. 'విజయవాడ రావద్దని వార్నింగ్ ఇస్తున్న వాళ్లకి నా కౌంటర్ వార్నింగ్. నేనెప్పుడొస్తానో, ఎక్కడుంటానో చెప్తా.. మీకు దమ్ముంటే ముంబైలో అడుగు పెట్టండి' అంటూ ప్రతి సవాల్ కూడా విసిరాడు.
ఇలాంటి బెదిరింపులకు వర్మ లొంగే రకం కాదని ఈ దెబ్బతో తేలిపోతుంది. తను ఉండబోయే హోటల్ డీటైల్స్ కూడా చెప్పడం, దమ్ముంటే ముంబై రమ్మనడం అచ్చమైన వర్మ ట్రేడ్ మార్క్ బెదిరింపు. మరి దీనికి వర్మని బెదిరిస్తున్న 'బెజవాడ రౌడీల' రియాక్షన్ ఎలా ఉంటుందో?