బెజవాడలో తియ్యకుండానే ఫినిష్??

Update: 2016-07-01 06:21 GMT
మొదట్లో అయితే రామ్ గోపాల్ వర్మను అందరూ సంచలన దర్శకుడు అనేవారు. ఆ తర్వాత ఈ పేరు మెల్లగా వివాదాస్పద దర్శకుడిగా మార్చేశారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. సినిమాలో కంటెంట్ కంటే.. పబ్లిసిటీ కోసం ఈ డైరెక్టర్ అనుసరించే రూట్.. అసలు సమస్యగా చెప్పచ్చు. ఏదో ఒక వివాదంతో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం వర్మ స్టైల్. కొన్ని నెలల క్రితం వంగవీటి అంటూ అనౌన్స్ చేసి.. ఇలాంటి హంగామానే సృష్టించాడీ కాంట్రవర్షియల్ డైరెక్టర్.

టైటిల్ ప్రకటించినప్పటి నుంచి కేరక్టర్స్ ని పరిచయం చేయడం వరకూ.. బెజవాడలో కుల రాజకీయాలు అంటూ నెట్ లో ట్వీట్స్ పెట్టడం నుంచి ఫలానా ఫ్లైట్ వస్తున్నా ఏం చేస్తారో చేయండి అనేవరకూ.. హంగామా నడిచింది. చెప్పినట్లుగానే బెజవాడలో పలువురిని కలిసి వార్తల్లో తెగ కనిపించేశాక హఠాత్తుగా మాయమైపోయిన వర్మ.. అసలు వంగవీటి మూవీ గురించి అప్ డేట్స్ ఇవ్వడం కూడా మానేశాడు. ముంబైలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం.. వీరప్పన్ సినిమాని బాలీవుడ్ లో తీయడంతో.. వర్మ మొదలెట్టి ఆపేసిన సినిమాల జాబితాలో ఇది కూడా చేరిందనే టాక్ వినిపించింది.

అయితే.. అసలు విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఇప్పటికే వంగవీటి మూవీ షూటింగ్ పూర్తయిపోయిందట. ముంబైలోనే విజయవాడకు సంబంధించి సెట్స్ వేసి వర్మ షూటింగ్ ఫినిష్ చేసేశాడని తెలుస్తోంది. త్వరలో మరిన్ని డీటైల్స్ తో ఈ దర్శకుడు రిలీజ్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రాజెక్టు ప్రకటించడంతోనే చాలా సంచలనాలు  సమస్యలు తెచ్చిన ఈ వంగవీటి.. రిలీజ్ తర్వాత మరెన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో!
Tags:    

Similar News